Perni Nani – Pawan Kalyan : లాజిక్స్ తో పవన్ కళ్యాణ్ ని ఉక్కిరిబిక్కిరి చేసిన పేర్ని నాని ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Perni Nani – Pawan Kalyan : లాజిక్స్ తో పవన్ కళ్యాణ్ ని ఉక్కిరిబిక్కిరి చేసిన పేర్ని నాని !

Perni Nani – Pawan Kalyan : అసలు పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారు? పార్టీ పెట్టిన వ్యక్తి అన్ని స్థానాల్లో పోటీ చేయాలి కదా. కానీ.. చేయరు. 2014 లో పార్టీ పెట్టారు. పెట్టి కూడా 10 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా గెలిచింది లేదు. ఏదో ఒక్క సీటు గెలిచినా ఆ ఎమ్మెల్యే కూడా ప్లేట్ మార్చారు. ఇలా జనసేన పార్టీని ఎవరి లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :15 May 2023,1:30 pm

Perni Nani – Pawan Kalyan : అసలు పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారు? పార్టీ పెట్టిన వ్యక్తి అన్ని స్థానాల్లో పోటీ చేయాలి కదా. కానీ.. చేయరు. 2014 లో పార్టీ పెట్టారు. పెట్టి కూడా 10 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా గెలిచింది లేదు. ఏదో ఒక్క సీటు గెలిచినా ఆ ఎమ్మెల్యే కూడా ప్లేట్ మార్చారు. ఇలా జనసేన పార్టీని ఎవరి లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ పెట్టారు అనే ప్రశ్నలు చాలామందిలో మెదులుతున్నాయి. వాటికి బలం చేకూర్చుతూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్రి నాని ఓ బాంబు పేల్చారు.

Perni Nani fires on pawan kalyan and chandrababu

Perni Nani fires on pawan kalyan and chandrababu

అసలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారంటూ ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మీటింగ్ పెడతారో? ఎప్పుడు సినిమాల్లోకి వెళ్తారో? ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తారో ఎవ్వరికీ తెలియదని.. ఆరు నెలలకు ఒకసారి రోడ్డు మీదికి పవన్ వస్తారని.. ఇక.. రైతులను పరామర్శిస్తున్నా అనే పేరుతో చంద్రబాబు అనుకూల రాజకీయం చేస్తున్నారంటూ పేర్ని నాని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నప్పుడు కూడా జగన్ ను విమర్శించిన ఘనత పవన్ ది అంటూ దుయ్యబట్టారు పేర్ని నాని.

perni nani comments on pawan kalyan and chandrababu

perni nani comments on pawan kalyan and chandrababu

Perni Nani – Pawan Kalyan : జనం కోసం నీ జీవితంలో ఒక 10 రోజులు అయినా చేశావా పవన్

జనం కోసం పట్టుమని 10 రోజులు అయినా పని చేశావా పవన్. కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మరీ మోసం చేశారు. చంద్రబాబు కాపులను మోసం చేశారని అందరికీ తెలుసు. మరి.. నువ్వు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పోరాడారు. దానికి చంద్రబాబు ఆయనపై దాడి చేశారు. అప్పుడు ఎందుకు పవన్ స్పందించలేదు. చంద్రబాబు కాపులను మోసం చేస్తే తాము అక్కున చేర్చుకుంటామని జగన్ ఆనాడే చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే రిజర్వేషన్లు ఉంటాయని జగన్ చెప్పారు. ఈ విషయం పవన్ కు తెలియదా? చంద్రబాబును ఎందుకు నిలదీయడు అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది