Fever | జ్వరం తర్వాత దగ్గు వస్తుందా.. అయితే ఇలా చేయండి..!
Fever | జ్వరం తగ్గిన తర్వాత కూడా పొడి దగ్గు వేధిస్తే దాని విషయంలో పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు.జ్వరం పోయిన తర్వాత కూడా ఈ దగ్గు ఎందుకు వస్తుంది? దాన్ని తగ్గించడానికి ఇంట్లో ఏం చేయాలి?
#image_title
జ్వరం తర్వాత దగ్గు ఎందుకు వస్తుంది?
జ్వరం తగ్గిన తర్వాత కలిగే పొడి దగ్గును వైద్య నిపుణులు “పోస్ట్ వైరల్ కఫ్” అంటారు. దీనికి కారణం జ్వరానికి కారణమైన వైరస్‌లు శ్వాసనాళాల్లో వాపు కలిగిస్తాయి. జ్వరం తగ్గిపోయినా, ఈ వాపు పూర్తిగా తగ్గడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో శ్వాసనాళాలు చాలా సున్నితంగా మారుతాయి. చిన్న మార్పులు, గాలిలోని పగుళ్లు, దుమ్ము, లేదా ఉప్పిరితిత్తులలోని స్రావాల వల్ల దగ్గు రావచ్చు. పైగా, గొంతు వెనుక భాగంలో శ్లేష్మం జారిపోవడం వల్ల గొంతు పొడిగా మారి దగ్గు ఉత్పన్నమవుతుంది
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూను తేనె కలిపి తాగండి. ఇది గొంతుకు ఉపశమనం ఇస్తుంది. రోజులో 2–3 సార్లు గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలిస్తే గొంతులో వాపు తగ్గుతుంది. వేడి నీటి ఆవిరిని 10 నిమిషాలపాటు ముక్కుతో లోపలికి పీల్చడం వల్ల శ్వాసనాళాలు శుభ్రం అవుతాయి. తగినంతగా నీరు తాగితే శరీరం హైడ్రేటెడ్‌గా ఉండి గొంతు పొడిబారకుండా ఉంటుంది.