Barrelakka | మళ్లీ వార్తలలోకి బర్రెలక్క.. ఈ సారి ఏం చేసిందంటే..!
Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో “బర్రెలక్క”గా అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది. శిరీష మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా, తలనొప్పి, జలుబుతో ఇబ్బంది పడుతున్నానని కన్నీళ్లు పెట్టుకుంటూ తెలియజేశారు. జ్వరం వచ్చిందని వీడియో చేసి పెడితే చాలా మంది తనకు కామెంట్స్ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తున్నారని తెలిపింది బర్రెలక్క

#image_title
ఈ సారి ఏ విషయంతో అంటే..
జ్వరం తగిలిందని వీడియో చేస్తే ఏమని అడగాలి.. జ్వరం తగ్గిందా? ఇప్పుడు ఎలా ఉంది.? టాబ్లెట్స్ వేసుకున్నారా .? అని అడగాలి అది కాకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బేబీ ఆరోగ్యంగా ఉందా? బేబీ మూమెంట్స్ మంచిగా ఇస్తుందా.. అని కామెంట్స్ చేస్తున్నారు. నేను ఆరోగ్యంగా ఉంటేనే కదా.. నా బేబీ ఆరోగ్యంగా ఉండేది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది
బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్కకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతిచ్చారు కూడా. దీంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. ఆ మధ్య పెళ్లి గురించి వార్తల్లో నిలిచింది. అయితే మూడు రోజుల నుంచి విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నా.. తలనొప్పి, జలుబుతో చాలా బాధ పడుతున్నాను. ముఖ్యంగా జలుబు బాగా ఇబ్బంది పెడుతుంది అని చెప్పుకొచ్చింది.
View this post on Instagram