PM Kisan Samman Nidhi 21th Installment | రైతులకి శుభవార్త.. దీపావళికి ముందు వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..
PM Kisan Samman Nidhi 21th Installment | అక్టోబర్ 20న దీపావళి దేశవ్యాప్తంగా జరుపుకోనుండగా, ఆ లోపే రైతులకు కిసాన్ పథకానికి సంబంధించిన 21వ విడత నిధులు జమ చేయనున్నట్టు లీకులు వస్తున్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ పథకం ద్వారా కేంద్రం రైతులకు సాయం చేస్తుండగా. ఏటా 6వేల రూపాయలు అందజేస్తోంది. ఇది మూడు విడతల్లో ఇస్తోంది.

#image_title
ఆనందమే ఆనందం..
ఈ ఆర్థిక సంవత్సరానికి జులైలో ఇవ్వాల్సిన రెండు వేల రూపాయలను ఆగస్టులో ఇచ్చింది. ఇప్పుడు యథావిధిగా అక్టోబర్‌లో ఇవ్వాల్సిన నిధులను ఇచ్చేయనుంది కేంద్రం. అక్టోబర్ 18న రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికి ఇరవై దఫాలుగా రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున నగదు వేశారు. ఇప్పుడు ఈ అక్టోబర్‌లో 21వ విడత నిధులు వేయనున్నారు.
జీఎస్టీలో మార్పులు చేర్పులు చేసిన కేంద్రం వాటిని ఈ నెల 22 నుంచి అమల్లోకి తీసుకొస్తోంది. ఈ ఏడాదిలో మొదటి విడత ఆలస్యమైనా, మిగతావి సరైన సమయంలో వేయాలని చూస్తోంది. గత సినారియో చూస్తే కూడా అక్టోబర్‌లో రైతు కిసాన్ నిధులు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా నిధుల జమపై అధికారిక ప్రకటన వస్తుందో లేదో తెలియదు కానీ ఈ లోపు రైతులు చేయాల్సిన కొన్ని పనులు మాత్రం మర్చిపోవద్దు. లేకుంటే నిధులు ప్రభుత్వం విడుదల చేసినా మీ ఖాతాల్లో పడకపోవచ్చు. తర్వాత ఎన్ని ఫిర్యాదులు చేసిన ప్రయోజనం లేకుండా పోవచ్చు. అర్హత ఉండి కూడా నిధులు జమ కాని రైతులు ముందుగా ఈ కేవైసీ చేయించుకోవాలి. ఆధార్ నెంబర్‌తో బ్యాంకు ఖాతాలను లింక్ చేసుకోవాలి.