Loan | 10 ల‌క్ష‌ల రూపాయ‌ల లోన్ కావాలా.. మూడేళ్లకు నెలకు ఈఎంఐ ఎంత అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Loan | 10 ల‌క్ష‌ల రూపాయ‌ల లోన్ కావాలా.. మూడేళ్లకు నెలకు ఈఎంఐ ఎంత అంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :13 September 2025,9:00 pm

Loan | మనకు ఖ‌ర్చుల‌కి డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు బ్యాంకులే దిక్కు. బ్యాంకులు.. విరివిగా లోన్లు అందిస్తున్నాయి. ఇంకా పెద్దగా డాక్యుమెంటేషన్ అవసరం లేకుండానే క్షణాల్లో లోన్ డబ్బులు.. బ్యాంక్ అకౌంట్లో పడిపోతున్నాయి. ప్రముఖ బ్యాంకుల్లోనూ తక్కువ వడ్డీకే లోన్లు అందుబాటులో ఉన్నాయి.

Banks ఏప్రిల్ నుండి బ్యాంకులు వారానికి 5 రోజులేనా ప్రభుత్వం ఏం చెబుతుంది

మీకు న‌చ్చిన‌ట్టు…

మీకు రూ. 10 లక్షలు రుణం కావాలనుకుందాం. చాలా బ్యాంకులు కనీసం 11 వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయి. దీనిని మీరు మీ స్థోమతను బట్టి మూడేళ్లలో చెల్లించాలనుకుంటే.. అంటే మొత్తం 36 నెలలకు చూస్తే.. ఈఎంఐ నెలకు రూ. 32,738 పడుతుంది. మీకు ఇది కాస్త ఎక్కువ అనిపించిందనుకోండి. అంటే నెలకు మీ దగ్గర అంత మిగలట్లేవ్ అనుకుంటే.. కాస్త తక్కువ ఈఎంఐ కోసం చూడాలి. రూ. 30 లోపు అయితే బెటర్ అనిపిస్తే ఒక ఆప్షన్ ఉంది.

ఇక్కడ లోన్ టెన్యూర్ పెంచుకోవాల్సి వస్తుంది. మరో 4 నెలలు అంటే 40 నెలలకు టెన్యూర్ పెంచితే ఈఎంఐ రూ. 29,975 కు చేరుతుంది. ఇది కూడా ఎక్కువే అనిపిస్తే.. నాలుగేళ్లు చెల్లించొచ్చు. అప్పుడు ఈఎంఐ ఇంకా తక్కువగా రూ. 25,845 పడుతుంది. తొందరగా లోన్ క్లియర్ చేయాలని మీకు అనిపిస్తే ఇందుకు ముందే సిద్ధమై ఎక్కువ ఈఎంఐ పెట్టుకోవచ్చు. ఇక్కడ 36 నెలలకు బదులుగా 30 నెలలు ఎంచుకుంటే.. ఈఎంఐ రూ. 38,278 పడుతుంది. ఇంతకంటే ఎక్కువ కడతా అనుకుంటే.. దీనిని రెండేళ్లకు (24 నెలలు) తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఈఎంఐ రూ. 46,607 పడుతుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది