Loan : లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. బ్యాంకు రుణమాఫీ చేస్తుందా? లేదా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Loan : లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. బ్యాంకు రుణమాఫీ చేస్తుందా? లేదా?

 Authored By ramu | The Telugu News | Updated on :19 July 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Loan : లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. బ్యాంకు రుణమాఫీ చేస్తుందా? లేదా?

Loan : అప్పు తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ రుణ భారం ఎవరి మీద పడుతుంది? ఇది చాలా మందిని గందరగోళానికి గురిచేసే ప్రశ్న. గృహ రుణం తీసుకున్నవారు చనిపోతే ఇంటి భద్రత ఏమవుతుంది?ఇల్లు కొనేందుకు తీసుకునే హౌస్ లోన్ అన్నదే పెద్ద మొత్తం.

Loan లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే బ్యాంకు రుణమాఫీ చేస్తుందా లేదా

Loan : లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. బ్యాంకు రుణమాఫీ చేస్తుందా? లేదా?

Loan : ఇలా చేయండి..

ఇది తాకట్టు రుణం. అంటే రుణానికి బదులుగా మీరు ఇంటిని బ్యాంకుకు తాకట్టు పెట్టారు. మీరు చనిపోతే… సహ-రుణగ్రహీత ఉంటే, బ్యాంకు ముందుగా అతనిని సంప్రదించి EMI చెల్లించమని అడుగుతుంది. హామీదారు లేదా చట్టబద్ధ వారసులు (భార్య, భర్త, పిల్లలు) ఉంటే, వారిని నోటిఫై చేసి రుణాన్ని ఎలా తీర్చాలి అనే దానిపై చర్చిస్తుంది.

రుణ బీమా తీసుకుని ఉంటే, బ్యాంకు బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ తీసుకుంటుంది. ఇవన్నీ సాధ్యపడకపోతే, SARFAESI చట్టం ప్రకారం ఇంటిని వేలం వేసి బ్యాంకు తన డబ్బును తిరిగి పొందే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే – మీరు ఎప్పటికప్పుడు బీమా ప్రీమియంలు చెల్లిస్తే మాత్రమే బ్యాంకు బీమా ద్వారా డబ్బు క్లెయిమ్ చేస్తుంది. కారు లోన్ కూడా గృహ రుణం లానే తాకట్టు రుణమే. రుణాన్ని తీర్చేందుకు ఆసక్తి చూపించకపోతే, బ్యాంకు కారును స్వాధీనం చేసుకుని, వేలం వేస్తుంది.వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని రుణంగా పరిగణించి, మిగిలిన వడ్డీ లేదా నష్టాన్ని బ్యాంకు మూసివేస్తుంది. రుణం తీసుకోవడం జీవితంలో సాధారణం. కానీ దానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని మీరు ముందే తెలుసుకోవాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది