Postal Scheme : పోస్టాఫీస్‌లో బెస్ట్ స్కీమ్..రూ.2 వేలు కడితే రూ.27 లక్షలు..!
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం ఉత్తరాలను, ఇతర సమాచారాలను చేరవేసేది. అయితే ఇప్పుడు మాత్రం అలా కాదు..పోస్టాఫీస్ అనేక రకాల సేవలను ప్రజలకు అందిస్తుండడంతో సామాన్య ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామీణ తపాలా జీవిత బీమా రూ.10 వేల నుండి 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ స్కీం తీసుకువచ్చింది.
Postal Scheme : బెస్ట్ స్కీమ్..
అన్ని స్కీముల కన్నా బెస్ట్ స్కీమ్ అని తెలుస్తుండగా, దీనికి వయసు 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఒకవేళ ఈ పథకం మధ్యలో డబ్బులు లేక ఆపినా తిరిగి మళ్లీ పునరావృతం చేసుకోవచ్చు అని సూర్యాపేట డివిజన్ పోస్టల్ అసిస్టెంట్ ఆంజనేయులు లోకల్ 18 ద్వారా తెలియజేశారు.. గ్రామీణ తపాల జీవిత బీమా అనేది 1995 ఉండి నేటి వరకు అందుబాటులో ఉండగా, ఈ పథకంలో ఉన్న ఉపయోగాలు ఏంటంటే రూ.10 వేల నుండి రూ.10 లక్షల వరకు స్కీం తీసుకోవడానికి అందుబాటులో ఉంది. బయట వాళ్ల స్కీమ్ కంటే ఎన్నో రెట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి లబ్ధి చేకూరుస్తుందన్నారు. ఈ పాలసీ ఒక కుటుంబంలో యజమాని తీసుకుంటే అనుకోకుండా మరణం సంబంధించినప్పుడు అతని కుటుంబ సభ్యులకి ఇన్సూరెన్స్ డబ్బులు అందిస్తారని చెప్పుకొచ్చారు….
లోన్ ఫెసిలిటీ, సరెండర్ ఫెసిలిటీ అదే విధంగా పాలసీ తీసుకున్నప్పుడు డబ్బులు ఉండి మధ్యలో డబ్బులు లేని పరిస్థితిలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల అయిన కూడా తిరిగి మళ్లీ ఈ పాలసీ కొనసాగించవచ్చని అంటున్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు , ఫోటో, నామిని డీటెయిల్స్ తీసుకొని స్థానిక పోస్టల్ ఆఫీస్‌కి వెళ్తే పథకం పేరు చెప్తే.. ఇన్సూరెన్స్ పదివేలు,50 వేలు, లక్ష,10 లక్షల ప్రకారం ఒక నెలవారీగా ఎంత కట్టాలని పోస్టల్ అధికారి చెప్తారని లోకల్ 18 ద్వారా తెలియజేశారు. డబ్బులు పొదుపు చేసేందుకు పోస్టాఫీసుల్లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. డబ్బులు కూడబెట్టుకోవాలనే వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి.