Policy Loan : రుణం కోసం తిరుగుతున్నారా.. మీకు భీమా పాలసీ ఉంటే ఈ లోన్ ట్రై చేయండి
Policy Loan : మనిషి తన పుట్టుక నుంచి చావు వరకు డబ్బులు కావాలి. వాటి కోసమే తన జీవితాంతం కష్టపడుతుంటాడు. జీవిత చక్రం అనేది డబ్బు మీద ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే. పెళ్లి, పిల్లలు, వారి చదవులు, ఆరోగ్యం, తిరిగి వారికి పెళ్లిళ్లు చేయాలన్నా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఇక వయస్సు మీద పడి శరీరం సహకరించకపోయిన క్రమంలో కూర్చుని తినాలంటే అప్పుడు డబ్బులు కావాలి.ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్‌ను చూసుకునే బాధ్యతను తగ్గించుకుంటున్నారు. అందుకే చాలా మంది యవ్వనంలో ఉన్నప్పుడే భీమా పాలసీలు చేయించుకుంటున్నారు. ఇవి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తాయని ఆర్థిక విశ్లేషకులు సెలవిస్తున్నారు.
Policy Loan : భీమా పాలసీపై రుణం ఎలా తీసుకోవాలంటే..
చాలా మందికి అర్జెంటుగా డబ్బులు అవసరం పడుతుంటాయి. ఇల్లు నిర్మించుకోవడానికి లేదా పిల్లల ఎడ్యూకేషన్, మెడికల్ ట్రీట్మెంట్ అలాంటి టైంలో ఇతరుల దగ్గర అప్పు చేయకుండా మీ పాలసీపై రుణం పొందవచ్చట..దీని కోసం ఏదైనా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) లేదా బ్యాంకును మీరు సంప్రదించాలి. అక్కడ తక్కువ వడ్డీకి రుణం పొందవచ్చట. ఇక వడ్డీ రేట్లు అనేవి మీరు తీసుకునే రుణంపై ఆధారపడి ఉంటాయి. పాలసీపై తీసుకున్న లోన్ పై మీరు చెల్లించాల్సిన వడ్డీ.. మీ ప్రీమియం మొత్తం, వాయిదాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
ప్రీమియం, వాయిదాల సంఖ్య ఎక్కువ ఉంటే వడ్డీ రేటు తక్కువ ఉంటుంది. అయితే, సాధారణంగా బీమా పాలసీపై తీసుకున్న రుణంపై వడ్డీ రేట్లు 10 నుంచి 12 శాతం మధ్య ఉంటాయట.. మనం బీమా పాలసీ తీసుకున్న కంపెనీ కూడా లోన్ ఇస్తుందట..అందుకోసం మీరు చెల్లించే బీమా ప్రీమియం ఆధారంగా ఆ కంపెనీ రుణం అందిస్తుంది.దానిని నిర్ణీత వ్యవధిలోగా చెల్లించాలి.దీనికి వడ్డీ రేట్లు బ్యాంకు కంటే తక్కువగానే ఉంటాయట. ఒకవేళ రుణం తిరిగి చెల్లించలేకపోతే మీ మొత్తం ప్రీమియం నుంచి రుణం మొతాన్ని మైనస్ చేస్తారు. మిలిగిన డబ్బులు మీకు చెల్లిస్తారు.