Post Office Scheme : ఈ పథకంలో ప్రతినెల రూ.1200 జమ చేస్తే.. రూ.1 కోటి లాభం పొందవచ్చు..
Post Office Scheme : కేంద్ర ప్రభుత్వం అమలుపరిచిన పథకాల ద్వారా ఎటువంటి భయం లేకుండా సంపాదించిన డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకాల ద్వారా మంచి లాభాన్ని కూడా పొందవచ్చు. అటువంటి పథకాలలో ఒకటి పోస్ట్ ఆఫీస్ యొక్క పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఈ పథకంలో దీర్ఘకాలికంగా జమ చేస్తే ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చు. ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావితం కాదు. అంతేకాకుండా పన్ను బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. పీపీఎఫ్ లో సంపాదించిన వడ్డీ మరియు మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితం. ఈ వడ్డీ రేట్లు ప్రభుత్వం చే నిర్ణయించబడతాయి. ఇది త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షించబడుతుంది.
ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ పిపిఎఫ్ పథకంపై 7.1 శాతం వడ్డీని అందిస్తుంది. 2020 లో దీనిలో వడ్డీ7.6 శాతం వరకు ఇచ్చేవారు. కానీ కరోనా ఇతర కారణాల వలన వడ్డీని తగ్గించారు. పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాని తెరవచ్చు. కేవలం 500 తో ఈ ఖాతాను తెరవచ్చు. ఇందులో ఏడాదికి 1.5 0 లక్షలు జమ చేయొచ్చు. ఈ ఖాతా మెచ్యూరిటీ 15 ఏళ్ళు. కానీ తర్వాత ఐదేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. ప్రతి నెల ఈ ఖాతాలో 12,500 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి 40.68 లక్షలు పొందవచ్చు. ఇందులో మొత్తం పెట్టుబడి 22.50 లక్షలు వడ్డీ ద్వారా 18.18 లక్షల ఆదాయం పొందవచ్చు. ఈ లెక్కన పదిహేను సంవత్సరాలకి ఏటా 7.1% వడ్డీ రేటును అంచనా వేసుకుంటే ఆ మొత్తం తీసుకోవచ్చు.
వడ్డీ రేటు మారినప్పుడు మెచ్యూరిటీ మొత్తం మారచ్చు. ఈ పథకం ద్వారా మీరు కోటీశ్వరులు కావాలంటే 15 ఏళ్ల తర్వాత మరో 10 ఏళ్లు మెచ్యూరిటీ సమయాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు మీ పెట్టుబడి కాలవ్యవధి 25 సంవత్సరాలుగా మారింది. ఈ విధంగా 25 సంవత్సరాల తర్వాత మొత్తం కార్పస్ 1.03 కోట్లు అవుతుంది. ఈ కాలంలో మీ మొత్తం పెట్టుబడి 37.5 లక్షలు కాగా, వడ్డీ ద్వారా 65.58 లక్షలు పొందుతారు. ఇందులో సంపాదించిన వడ్డీ పై సావరింగ్ గ్యారెంటీ ఉంది. ఒకవేళ మీరు పిపీఎఫ్ ఖాతాను పొడిగించాలనుకుంటే ఒక సంవత్సరం ముందే దరఖాస్తు చేసుకోవాలి. మెచ్యూరిటీ తర్వాత ఖాతా పొడిగించబడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి.