Post Office Scheme : అదిరిపోయే పోస్టాఫీస్ పథకం… రోజుకు రూ.50 పెట్టుబడితో 35 లక్షలు రిటర్న్స్…!
Post Office Scheme : పోస్టాఫీస్ లో పెట్టుబడికి అనేక రకాల పథకాలు ఉన్నాయి. ఈ పథకాలలో పొదుపు చేస్తే కచ్చితంగా మంచి రాబడిని పొందుతారు. పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష పథకం తక్కువ రిస్క్ తో మెరుగైన రాబడుల ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ పథకంలో పెట్టుబడిదారులు ప్రతినెల 1500 డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ టైమ్ కి 31 నుండి 35 లక్షల వరకు పొందుతారు. 19 నుండి 55 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఎవరైనా పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిదారులు నెలవారి త్రైమాసికం, అర్థ వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు.
పెట్టుబడిదారుడు 19 సంవత్సరాల వయసులో ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించి అతని కనీస హామీ మొత్తం పది లక్షలు అయితే 55 ఏళ్ల వయసులో దాదాపు 31.60 లక్షలు పొందడానికి నెలకు 1515 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు 1163 చెల్లిస్తే 58 ఏళ్ల వయసు 33.40 లక్షల అందుతాయి. అలాగే నెలకు 1411 చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత 34.60 లక్షలు రిటర్న్ వస్తాయి. పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు దాదాపు 50 చెల్లించడం ద్వారా కొన్ని సంవత్సరాలు తర్వాత 35 లక్షల రాబడిన పొందుతారు. పోస్ట్ ఆఫీస్ నెలవారి ఆదాయ పథకం పై వడ్డీరేట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 6.6 శాతం నుండి 6.7% పెంచింది.

Post Office scheme is 35 lakh returns with an investment of Rs.50 per day
వరుసగా తొమ్మిది త్రైమాసికాల తర్వాత చిన్న పొదుపు పథకం పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగించింది. డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెరిగాయి. దీని కారణంగా ఇప్పుడు పెట్టుబడిదారులు ఈ పథకాలపై ఎక్కువ బెనిఫిట్ పొందవచ్చు. ఇలా పోస్ట్ ఆఫీస్ లో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు బ్యాంకులకే పరిమితమైన ఈ పథకాలు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లోను అందుబాటులోకి వచ్చాయి. పోస్టల్ శాఖ ద్వారా మెరుగైన సేవలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా పోస్ట్ ఆఫీస్ లలో సేవలను ప్రవేశపెడుతుంది.