Post Office : పోస్ట్ ఆఫీస్ లో బెస్ట్ స్కీమ్ ఇదే రూ.10,000 పెట్టుబడి పెడితే, రూ.16.26 లక్షల ఆదాయం వస్తుంది!!
Post Office : చాలామందికి డబ్బులు ఎక్కడ దాచి పెట్టాలో అర్థం కాదు. ఎక్కడ దాచిపెడితే సేఫ్ గా ఉంటుందని ఆలోచిస్తుంటారు. అలాగే ఎక్కువ ఆదాయం అందించే ఫైనాన్షియల్ ప్రోడక్ట్ ల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి మంచి ఆదాయాన్ని అందించే పథకాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా పోస్టాఫీస్ లోని పథకాలు చాలా బెస్ట్. భారతదేశంలో వేతనాలు పొందే మధ్యతరగతి వాళ్ళకి ఈ పోస్టాఫీస్ స్కీమ్స్ చాలా మంచివి. మధ్య తరగతి వారు ఈ పోస్టాఫీస్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. బ్యాంక్ ఎఫ్ డి (ఫిక్స్ డ్ డిపాజిట్ లు) ఆర్ డీ (రికరింగ్ డిపాజిట్లు) వంటి పోస్టల్ స్కీమ్స్ మంచి రాబడిని అందిస్తున్నాయి. పోస్టాఫీస్ ఆర్ డీ స్కీమ్ అనేది పెట్టుబడిదారులకు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే బెస్ట్ ఆప్షన్. ఈ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఎకౌంటును ఎవరైనా పెద్దలు లేదా పది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు కూడా ఓపెన్ చేసుకోవచ్చు.
రికరింగ్ డిపాజిట్ పథకంలో కనీసం నెలవారి డిపాజిట్ రూ.100 చెల్లించాలి. ప్రతినెల రూ.100 గణాంకాల్లో మినిమం అమౌంట్ చెల్లించవచ్చు. పోస్టాఫీస్ ఆర్ డీ సంవత్సరానికి 5.8% వడ్డీ రేటును అందిస్తుంది. జులై 2022 మంచి రేటు అమలులోకి వస్తుంది. ఈ వడ్డీ రేటు త్రైమాసికానికి కలిపి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో తన చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను నిర్ణయిస్తుంది. ఈ పోస్టాఫీస్ ఆర్ డీ ఎకౌంటు తెరిచిన తారీకు నుంచి ఐదు సంవత్సరాలు లేదా 60 నెలల తర్వాత మెచ్యూర్ అవుతుంది. డిపాజిటర్ మూడు సంవత్సరాల తర్వాత పోస్టాఫీస్ లో ఆర్ డి ఎకౌంటును మూసి వేయవచ్చు. ఎకౌంట్ తెరిచిన తారీకు నుంచి ఒక సంవత్సరం తర్వాత 50% వరకు రుణాన్ని పొందవచ్చు. మెచ్యూరిటీ కి ఒకరోజు ముందు కూడా అకౌంట్ గడువు ముందే మూసివేస్తే పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ ఆధారంగా వడ్డీ రేట్లు వర్తిస్తాయి .ఒక పోస్ట్ ఆఫీస్ ఆర్ డి ఎకౌంటు మెచ్యూరిటీ తారీకు నుంచి 5 సంవత్సరాల వరకు డిపాజిట్ లేకుండా కూడా ఉంచుకోవచ్చు.
ఈ పథకం ద్వారా వినియోగదారులకు డబ్బు, కాలక్రమేణ సంపాదించే వడ్డీ రెండు సురక్షితంగా ఉంటాయి. మంచి ఆదాయాన్ని అందిస్తూనే పొటెన్షియల్ రిస్క్ ను కూడా తగ్గిస్తుంది. ఎవరైనా చిన్న మొత్తంలో డబ్బులు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక రాబడిని పొందవచ్చు. అలాంటివారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం బెస్ట్ ఆప్షన్. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఎకౌంట్ తెరిచిన ఒక సంవత్సరం తర్వాత దరఖాస్తుదారులు తమ డిపాజిట్ బ్యాలెన్స్ లో 50% వరకు విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 5.8% వడ్డీ రేటు తో ప్రతి నెల రూ.100 పెట్టుబడి పెడితే పదేళ్లలో ఆ మొత్తం దాదాపు 16 లక్షల రాబడిగా వస్తుంది. 10 సంవత్సరాలకు మొత్తం డిపాజిట్ 12 లక్షలవుతుంది. దాదాపు 4.6 లక్షల రాబడి ఉంటుంది. దీనిపై ప్రతి త్రైమాసికంలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గణిస్తారు.