Postal Department Jobs : పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల… 30,700 పోస్టుల భర్తీకి భారీ రిక్రూట్మెంట్…!

Authored By aruna | The Telugu News | Published on: February 12, 2024, 8:00 am
  •  Postal Department Jobs : పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల... 30,700 పోస్టుల భర్తీకి భారీ రిక్రూట్మెంట్...!

Postal Department Jobs : తెలుగు రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి పోస్టల్ జిడిఎస్ నోటిఫికేషన్ 2024 నుండి 30,700 పోస్టులను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ అఫీషియల్ గా విడుదలైనట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ ఉద్యోగాలు మనకి పోస్ట్ ఆఫీస్ నుండి పోస్టల్ జిడిఎస్ నోటిఫికేషన్ 2024 విడుదల చేశారు.

జాబ్ డిస్క్రిప్షన్ : ఈ బంపర్ రిక్రూట్మెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఒకటైన పోస్టల్ డిపార్ట్మెంట్ ఏపీ పోస్టల్ జాబ్స్ కింద విడుదల చేసింది.

ఖాళీలు : ఈ పోస్టల్ జిడిఎస్ నోటిఫికేషన్ 2024 ద్వారా 30,700+GDS పోస్టులను భర్తీ చేసేందుకు పోస్టల్ శాఖ ఈ రిక్రూట్మెంట్ ను విడుదల చేయడం జరిగింది.

వయస్సు : ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ వయసు సడలింపు కింద SC/ST లకు ఐదు సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యార్హత : ఈ పోస్టల్ జిడిఎస్ నోటిఫికేషన్ కు అప్లై చేయాలి అనుకునేవారు 10th పాస్ అయి ఉండాలి.

రుసుము : దీనిలో SC/ST మరియు మహిళలకు ఎలాంటి ఫీజు ఉండదు.

జీతం : సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఈ ఉద్యోగాలలో ఉత్తీర్ణత సాధించినవారికి బేసిక్ శాలరీ కింద 15000 జీతం వస్తుంది.

ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు 10th క్లాసులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లై చేసే విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp