Postal Department Jobs : భారీ గుడ్ న్యూస్ .. పోస్టల్ శాఖలో 55,000 పోస్టుల భర్తీ ..!
Postal Department Jobs : నిరుద్యోగులకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక గొప్ప వార్తను అందించింది. పోస్ట్ మాన్ మరియు ఇతర కేటగిరీల 55 వేల పోస్టుల రిక్రూట్మెంట్ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదవ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు 81వేల వరకు జీతం పొందవచ్చు. తపాలా శాఖ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. ప్రస్తుతం భారత్ అంతట పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను ప్రతి […]
ప్రధానాంశాలు:
Postal Department Jobs : భారీ గుడ్ న్యూస్ .. పోస్టల్ శాఖలో 55,000 పోస్టుల భర్తీ ..!
Postal Department Jobs : నిరుద్యోగులకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక గొప్ప వార్తను అందించింది. పోస్ట్ మాన్ మరియు ఇతర కేటగిరీల 55 వేల పోస్టుల రిక్రూట్మెంట్ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదవ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు 81వేల వరకు జీతం పొందవచ్చు. తపాలా శాఖ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. ప్రస్తుతం భారత్ అంతట పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను ప్రతి ఏటా భర్తీ చేస్తున్నారు. రాష్ట్రాల వారిగా ఏటా 50 వేల మందికి పైగా రిక్రూట్ అవుతున్నారు. ఈ విధంగా 2024 కి సంబంధించిన రిక్రూట్మెంట్ వివరాలు కూడా విడుదలయ్యాయి.
2024 సంవత్సరంలో పోస్టల్ శాఖలో మొత్తం ఐదు విభాగాలకు రిక్రూట్మెంట్ నిర్వహించబడుతుంది. పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మాన్, సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఐదు విభాగాల్లో మొత్తం 55,000 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నెలలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు కనీస వేతనంగా 20,000 నుండి 25,000, పోస్ట్ మాన్ మరియు మెయిల్ గార్డులకు 81,100 , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కు 21 700 నుండి 69,100 జీతం 18 వేల నుంచి 56,900 వరకు ఉంటుంది. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మాన్ మరియు మెయిల్ గార్డ్ పోస్టులకు వయోపరిమితి 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి. మల్టీ టాస్కింగ్ సిబ్బందికి 18 నుండి 25 సంవత్సరాల వయసు పరిమితి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయోపరిమితిలో సడలింపు ఉంటుంది పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు పోస్ట్ మాన్ మరియు మెయిల్ గార్డులకు 12వ తరగతి మరియు మల్టీ టాస్కింగ్ సిబ్బందికి పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు https://www.indiapost.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి. ఈ పోస్టల్ విభాగంలో ఐదు విభాగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ వచ్చే నెలలో అధికారికంగా వెలువడే అవకాశం ఉంటుంది.