Telangana : పొలం కొని చదును చేస్తుంటే దొరికిన లంకె బిందె.. ఓపెన్ చేసి చూస్తే అన్నీ బంగారు ఆభరణాలే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana : పొలం కొని చదును చేస్తుంటే దొరికిన లంకె బిందె.. ఓపెన్ చేసి చూస్తే అన్నీ బంగారు ఆభరణాలే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :8 April 2021,8:42 pm

Telangana : లంకె బిందెలు… అనగానే మనకు గుర్తొచ్చేది సినిమానే. ఎందుకంటే.. సినిమాల్లోనే మనం లంకె బిందెల గురించి వింటుంటాం. లంకె బిందెల కోసం తవ్వకాలు జరపడం… నిధి కోసం వేటాడటం… మిస్టరీలు.. ఇవన్నీ సినిమాల్లోనే కదా ఉండేది. నిజ జీవితంలో మనం ఎప్పుడూ లంకె బిందెలను చూసింది లేదు. వినడం తప్ప. కానీ.. ఇప్పుడు మీరు చదవబోయేది సినిమాలోనిది కాదు. నిజంగా జరిగింది. నిజంగానే లంకె బిందెలు ఉంటాయి… అని చెప్పడానికి ఈ వార్తే ఉదాహరణ.

pot with gold found in jangaon district of telangana

pot with gold found in jangaon district of telangana

ఈ ఘటన తెలంగాణలోని జనగాం జిల్లా పెంబర్తిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన నర్సింహ అనే వ్యక్తి… రియల్ ఎస్టేట్ వ్యాపారి. జనగాం దగ్గర్లోని పెంబర్తిలో ఇటీవల… కొంత భూమిని కొన్నాడు. అక్కడ ప్లాట్లు చేసేందుకు భూమిని చదును చేయిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ తో భూమిని చదును చేయిస్తుండగా… ట్రాక్టర్ కు ఏదో తాకింది. దీంతో ట్రాక్టర్ దాన్ని గట్టిగా పట్టుకొని పైకి లాగింది. గట్టిగా పైకి లాగడంతో అది పగిలిపోయింది. దగ్గరికి వెళ్లి చూస్తే అది లంకె బిందె. లంకె బిందెలో ఏమున్నాయని వాళ్లు వెళ్లి చూడగా…. అన్నీ బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అందులో ఉన్నాయి.

Telangana : అమ్మవారికి చెందిన 11 తులాల బంగారం, 10 కిలోల వెండి లంకె బిందెలో బయటపడ్డాయి

అవి ఏదో గుడిలోని అమ్మవారికి చెందిన బంగారు పుస్తెలు, మెట్టెలు, గాజుల, కడాలు. అలాగే.. అమ్మవారికే చెందిన వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. దీంతో వెంటనే నర్సింహ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని…. లంకె బిందెలో ఉన్న ఆభరణాలను లెక్కించారు. దీంతో… 11 తులాల బంగారం, 10 కిలోల వెండి లభ్యమయింది.

నాకు కొన్ని రోజుల నుంచి అమ్మవారు కలలో వస్తున్నారు. బహుశా… ఈ లంకె బిందెను కనిపెట్టడం కోసమే కావచ్చు. అందుకే.. లంకె బిందె దొరికిన చోటునే నేను అమ్మవారికి గుడి కట్టిస్తా.. అని భూమి యజమాని నర్సింహ వెల్లడించారు. అయితే… లంకె బిందెలోని బంగారు ఆభరణాలను పరిశీలిస్తే… అవి ఇప్పటివి కావని… కాకతీయుల కాలం నాటివని… అప్పట్లోనే ఎవరో ఇక్కడ పూడ్చిపెట్టారని… ఇంకా అదే ప్రాంతంలో వెతికితే…. చాలా లంకె బిందెలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది