Modi : మోడీని గద్దె దించేందుకు ప్రశాంత్ కిషోర్ చాలా గట్టి ప్రయత్నాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Modi : మోడీని గద్దె దించేందుకు ప్రశాంత్ కిషోర్ చాలా గట్టి ప్రయత్నాలు

Modi : వరుసగా మూడవ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీయే కూటమి ప్రయత్నాలు చేస్తోంది. మూడవ సారి మోడీ ప్రధాని అవుతారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో దేశ వ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ ప్రయత్నాలు చేయాలి. కాని ఆ పనిని రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్‌ కిషోర్ మొదలు పెట్టాడు. కాంగ్రెస్ తో కలిసి ఆ పని చేయాలనుకున్న ప్రశాంత్ కిషోర్ కు అక్కడ […]

 Authored By himanshi | The Telugu News | Updated on :25 January 2022,7:30 pm

Modi : వరుసగా మూడవ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీయే కూటమి ప్రయత్నాలు చేస్తోంది. మూడవ సారి మోడీ ప్రధాని అవుతారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో దేశ వ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ ప్రయత్నాలు చేయాలి. కాని ఆ పనిని రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్‌ కిషోర్ మొదలు పెట్టాడు. కాంగ్రెస్ తో కలిసి ఆ పని చేయాలనుకున్న ప్రశాంత్ కిషోర్ కు అక్కడ స్పేస్ దక్కలేదు. ఆయన అనుకున్నట్లుగా అక్కడ పరిస్థితులు లేక పోవడంతో చేసేది లేక కాంగ్రెస్ ను వదిలేసి దూరంగా ఆ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఆయన మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడం కష్టమైన పని కాదు. త్వరలో జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండక పోవచ్చు. కాని రాబోయే కేంద్ర ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అనుకూలంగా వస్తాయనే నమ్మకంను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీతో మోడీ ప్రభుత్వంను కూల్చడం సాధ్యం కాకపోవచ్చు. కాని విపక్ష పార్టీలు అన్ని కలిసి ముందుకు వస్తే తప్పకుండా ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా మారే అవకాశం ఉందని ఆయన అన్నాడు. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక విధానాలు మరియు వారి పాలసీలు ప్రభుత్వంపై జనాల్లో విమర్శల పాలు అయ్యేలా చేశాయి. కనుక ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ సమయంలో సరైన వ్యూహంతో ముందుకు వెళ్తే మోడీని గద్దె దించడం అసాధ్యం కాదని ఆయన అంటున్నాడు.

Prashant kishor plans to defeat of bjp

Prashant kishor plans to defeat of bjp

కాంగ్రెస్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని.. వారి ప్రక్షాళణ తోనే దేశంలో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఆ ప్రక్షాళనకు కాంగ్రెస్ సిద్దంగా ఉందా అంటూ ఆయన ప్రశ్నించాడు. బీజేపీ హిందుత్వ వాదం మరియు సంక్షేమ పథకాలతో బీజేపీ ఎన్నికల్లోకి వెళ్లబోతుంది. కనుక వాటిని అధిగమించేలా విపక్ష పార్టీలు అన్ని కలిసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీసుకు వెళ్లాలి అన్నట్లుగా ప్రశాంత్‌ కిషోర్‌ సలహా ఇచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాబోయే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఉంటాయనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. మరి ప్రశాంత్ కిషోర్ అంచనా ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది