Moon : చందమామ రావే.. జాబిల్లి రావే.. అని మనం చిన్నప్పుడు పాడుకునే వాళ్లం. అమ్మ కూడా మనం మారాం చేస్తే.. అన్నం తినకపోతే.. అదిగో చందమామ అంటూ.. చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది. మనం చూసే చందమామ వేరు.. అసలు చందమామ వేరు. ఎందుకంటే.. మనం చూసే చందమామ.. ఎన్నో కోట్ల మైళ్ల దూరంలో ఆకాశంలో ఉంటుంది. దాన్ని మనం చూస్తే.. మనకు చిన్నగా కనిపిస్తాడు కానీ.. చందమామ కూడా ఇంచుమించు మన భూమి అంత ఉంటాడు. కానీ.. మనకు మాత్రం అంత చిన్నగా, తెల్లగా కనిపిస్తాడు కానీ..చంద్రుడు తెల్లగా ఉండడు. అసలు.. చంద్రుడిని దగ్గర నుంచి ఎవరైనా చూస్తే కదా. ఒకరిద్దరు చంద్రుడి దగ్గరికి వెళ్లి వచ్చారు కానీ.. పూర్తిగా చంద్రుడిని దగ్గర్నుంచి ఫోటోలు తీసిన వాళ్లు అయితే లేరు.
అందుకేనేమో.. పూణెకు చెందిన 16 ఏళ్ల ప్రతమేష్ జజు అనే కుర్రాడు.. భూమి మీద ఉండే.. చంద్రుడిని చాలా క్లియర్ గా ఫోటోలు తీసి చూపించాడు. ఆ ఫోటోలు చూస్తే మనం కూడా కెవ్వుమనాల్సిందే. అంత క్లియర్ గా ఉన్నాయి ఆ ఫోటోలు. అసలు.. ఆ ఫోటోలు చూస్తే.. చంద్రుడు మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. చంద్రుడి క్లారిటీ ఫోటోలు తీయడం కోసం ప్రతమేష్ సపరేట్ కెమెరానే తయారు చేసుకున్నాడు. దాన్ని జూమ్ చేసి జూమ్ చేసి.. కనీసం 100 జీబీల మెమోరీలో పట్టే అన్ని చంద్రుడి ఫోటోలను తీసి.. వాటిని ప్రాసెస్ చేస్తే అవి 186 జీబీల డేటా అవుతుందట. అప్పుడు ఆ ఫోటోలను అన్నింటిని కంప్రెష్ చేస్తే.. అప్పుడు 600 ఎంబీల మెమోరీతో చంద్రుడి ఫోటోలు ఉన్న ఫైల్ వస్తుందట.
మే 3న రాత్రి 1 గంటకు చంద్రుడి ఫోటోలను ప్రత్యేక కెమెరాతో తీశాడట జజు. రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 4 గంటల వరకు ఏకధాటిగా వీడియోలను, ఫోటోలను చిత్రీకరించాడట ప్రతమేష్. ఆ తర్వాత ఆ ఫోటోలను ప్రాసెస్ చేయడానికి రెండు రోజులు సమయం పట్టిందట. మొత్తం చంద్రుడికి సంబంధించిన 50 వేల ఫోటోలను ప్రతమేష్ క్లిక్ మనిపించాడట. అన్ని ఫోటోలను ఏరగా.. ఏరగా.. చంద్రుడి క్లియర్ ఫోటోలు కొన్ని బయటికి వచ్చాయట.
ఇక.. చంద్రుడి క్లియర్ ఫోటోను తీయడం కోసం.. ప్రతమేష్ బాగానే రీసెర్చ్ చేశాడట. యూట్యూబ్ లో వీడియోలు చూడటంతో పాటు.. కొన్ని ఆర్టికల్స్ చదవి.. ఇంటర్నెట్ లోనూ వెతికి.. రీసెర్చ్ చేసి చంద్రుడి ఫోటోలను తీశాడట. ఏది ఏమైనా.. మనోడు తీసిన చంద్రుడి ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ ఇంత క్లియర్ గా ఉన్న చంద్రుడి ఫోటోలను చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.