తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసు హాట్ టాపిక్ గా ఉంది. ఏపీ సీఐడీ వారు రాజద్రోహం కేసును సుమోటోగా రఘురామ కృష్ణం రాజుపై నమోదు చేసి విచారిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఈ కేసు ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్లింది. బెయిల్ పిటీషన్ ను సుప్రీం కోర్టులో వేయడంతో పాటు ఈ కేసులో ఏ2 మరియు ఏ3 అయిన టీవీ5 మరియు ఏబీఎన్ లు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ కేసులో అక్రమంగా తమ పేర్లను ఇరికించారంటూ వారు పిటీషన్ లో పేర్కొనడం జరిగింది. దాంతో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఆ విమర్శలను ఎదుర్కొనేందుకు వైకాపా నాయకులు ముందుకు వచ్చారు. తమపై వస్తున్న ఆరోపణలను వైకాపా నాయకుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయిన సజ్జల రామకృష్ణ ఖండించారు. ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింతగా చర్చకు తెర లేపాయి.
బెయిల్ పిటీషన్ సమయంలో కుటుంబ సభ్యులు తీసుకు వచ్చిన బోజనం తిని చాలా ఆరోగ్యంగా కనిపించడంతో పాటు మీసం మెలేసి కాళ్లను చూపించిన వ్యక్తి కారు దిగిన వెంటనే మీడియా ముందు నడవలేని పరిస్థితుల్లో ఉండటం విడ్డూరంగా ఉంది. ఆయన డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఈ కేసుతో జగన్ ప్రభుత్వంకు అస్సలు సంబంధం లేదు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో అస్సలు పట్టించుకోవడం లేదు. కనీసం ఈ విషయంలో మంత్రులు కూడా భాగస్వామ్యులు కారు అంటూ సజ్జల పేర్కొన్నారు. మీడియాలో పబ్లిసిటీ మరియు కేసు నుండి తప్పించుకోవడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. సుప్రీం కోర్టులోనే అసలు విషయాలు తెలుస్తాయంటూ సజ్జల అభిప్రాయం వ్యక్తం చేశాడు.
రాజ ద్రోహం కేసును ఎంపీ రఘురామ పై పెట్టడం ఏంటో అంటూ చంద్రబాబు నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేయడం చిత్రంగా ఉందంటూ సజ్జల పేర్కొన్నారు. అసలు రాజ ద్రోహం కేసు గురించి చంద్రబాబు నాయుడు తెలియదేమో అన్నట్లుగా ఫేస్ పెట్టి అమాయకత్వంతో రక్తి కట్టిస్తున్నాడు. ఆయన నాటకం అందరికి తెల్సిందే. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ప్రస్తుత తెలంగాణ సీఎం అయిన కేసీఆర్ పై 12 సార్లు రాజద్రోహం కేసును పెట్టడం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడుకు రాజద్రోహం కేసు తెలియకుండానే పెట్టాడా అంటూ ప్రశ్నించారు. ఇటీవల కూడా గుంటూరుకు చెందిన లాయర్ లపై రాజద్రోహం కేసును చంద్రబాబు నాయుడు పెట్టించాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రఘురామ కృష్ణం రాజు రాజద్రోహం కేసును గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ సజ్జల ఎద్దేవ చేశాడు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.