Preethi : ఇది ముమ్మాటికి హత్యే… సైఫ్ నీ ఉరి తీయాలి ప్రీతి సోదరి కీలక వ్యాఖ్యలు..!!
Preethi : వరంగల్ మేడికో ప్రీతి మృతి సంచలనం సృష్టించింది. దాదాపు ఐదు రోజుల పాటు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చావుతో పోరాడిన ఆమె ఆదివారం తుది శ్వాస విడవటం జరిగింది. ప్రీతి మృతి పట్ల తోటి విద్యార్థులు ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ క్రమంలో ప్రీతి సోదరి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాలేజీలో సీనియర్లు అందరూ కలిసి ఒక గుంపుగా క్రియేట్ అయ్యి… కులాన్ని ఎత్తి చూపుతూ తన సోదరిని తక్కువ చేశారని… ఆరోపించింది. సైఫ్ ఒక్కడే కాకుండా చాలామంది సీనియర్లు వేధించారని…
అందువల్లే మేటర్ అంత సీరియస్ అయిందని తెలిపింది. ఎటువంటి విషయమైనా ఫేస్ టు ఫేస్ చెప్పటం ప్రీతికి మొదటి నుండి అలవాటని బయట వారితో ఫోన్ లు కూడా చేయించి సీనియర్లు… ఆమెను వేధించారని పేర్కొంది. సీనియర్లు తనను ఏదో చేస్తారని ముందు నుండి తమతో చెబుతుందని.. ఇది కచ్చితంగా హత్యే అని ప్రీతి సోదరి ఆరోపించడం జరిగింది. ప్రీతి తనకు తాను మత్తు ఇంజక్షన్ తీసుకోలేదు. కొందరు పట్టుకుంటే సైఫ్ ఇంజక్షన్ చేశాడు. నలుగురిని ఎదిరించే బలం కూడా ప్రీతికి లేదని ఆమె సోదరీ తెలిపింది.
దీంతో సైఫ్ నీ ఉరితీయాలని… మిగతా సీనియర్లకు కూడా శిక్ష పడాలని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే ప్రీతీ మరణం తర్వాత విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయటంతో వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజ్ నిర్వాహకులు అలర్ట్ అయ్యారు. ఇదే సమయంలో కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క విద్యార్థి సంఘాలు కాకతీయ మెడికల్ కాలేజీని ముట్టడించాలని పిలుపునివ్వడం జరిగింది.
