
#image_title
Priyanka Arul Mohan | ‘ఓజీ’ చిత్రంలో పవన్ కళ్యాణ్ భార్యగా కన్మణి అనే పాత్రలో ఆకట్టుకుంది ప్రియాంక మోహన్ . ఆ చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. అయితే ప్రియాంక మోహన్‌కి ఊహించని షాక్ తగిలింది. బయట, సినిమాల్లోనూ ఆమె ఎంత పద్ధతిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటిది సోషల్‌మీడియాలో ఆమె మొహంతో కొన్ని ఫేక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
#image_title
పైశాచికం..
అందులో ప్రియాంక అసభ్యంగా, ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ప్రియాంక ఇలా మారిపోయిందేంటి అనుకుంటూ వాటిని తెగ షేర్ చేస్తున్నారు. ఈ విషయం ప్రియాంక దృష్టికి వెళ్లడంతో ఆమె ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేసింది. ‘ఏఐ ద్వారా నన్ను తప్పుగా చూపిస్తూ క్రియేట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫేక్ ఫోటోల్ని షేర్ చేయడం దయచేసి ఆపండి.
ఏఐ టెక్నాలజీని క్రియేవిటీ కోసం వాడుకోవాలి తప్ప తప్పుడు సమాచారం సృష్టించడానికి కాదు. మనం ఏది క్రియేట్ చేస్తున్నాం, ఏది షేర్ చేస్తున్నాం అన్న దానిపట్ల జాగ్రత్త వహించాలి’ అని ప్రియాంక ఘాటుగా స్పందించింది. ఈ విషయంలో నెటిజన్లు ప్రియాంకకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పైశాచిక ఆనందం కోసం ఎదుటివారిని చులకనగా చూపించేవారిని ఏం చేసినా తప్పులేదని కామెంట్లు చేస్తున్నారు.
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
This website uses cookies.