Prize Money | కప్ గెలిచిన టీమిండియా ప్రైజ్ మనీ ఎంత.. రన్నరప్ పాకిస్తాన్ ప్రైజ్ మనీ ఎంత?
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు గురిచేసింది. ఏకంగా 41 సంవత్సరాల తర్వాత ఈ రెండు చిరకాల ప్రత్యర్థులు ఆసియా కప్ ఫైనల్లో ఎదుర్కొనగా, చివరికి భారత జట్టు ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ పాక్‌పై జయభేరి మోగించింది.

#image_title
గొప్ప విజయం..
ఈ విజయంతో పాటు భారత జట్టుకు ట్రోఫీతో పాటు భారీ ప్రైజ్ మనీ లభించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన ప్రకారం, ఈ సారి విజేత జట్టుకు మూడు లక్షల అమెరికన్ డాలర్లు (US$ 300,000) ప్రైజ్ మనీగా లభించనుంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.2.66 కోట్లు. 2022లో జరిగిన టోర్నీతో పోలిస్తే ఇది ఒకటిన్నర రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు US$ 150,000 అంటే సుమారు రూ.1.33 కోట్లు ప్రైజ్ మనీ లభించింది.
ఇది భారత్‌కు వరుసగా రెండవ ఆసియా కప్ టైటిల్ కావడం విశేషం. 2023లో శ్రీలంకపై విజయం సాధించిన భారత జట్టు, ఇప్పుడు పాకిస్తాన్‌పై విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 2022లో శ్రీలంక జట్టు విజేతగా నిలిచినప్పుడు వారికి US$ 200,000 ప్రైజ్ మనీ లభించగా, runner-up పాకిస్తాన్ US$ 100,000 అందుకుంది. క్రికెట్ వర్గాల్లో ఈ సారి ప్రకటించిన ప్రైజ్ మనీ భారీగా పెరిగిందని, ఆటగాళ్లకు ఇది మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.