PV Sindhu : పారిస్ ఒలంపిక్స్‌లో మనోళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. మనుభాకర్ బుల్లెట్ 12 ఏళ్ల ఎదరుచూపులకు తెరదింపుతూ షూటింగ్‌లో కాంస్యాన్ని కైవసం చేసుకుంది. దీంతో చాలా రోజుల తరువాత షూటింగ్ విభాగంలో భారత్‌కు పతకం వచ్చింది. అంతేకాదు షూటింగ్‌లో ఒలింపిక్స్ పతకం కొట్టిన తొలి భారత మహిళగా మనుభాకర్ రికార్డులకెక్కింది. ఇక పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా రెండో రోజు జరిగిన తొలి మేజర్ మ్యాచ్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో భారత్ విజయంతో శుభారంభం చేసింది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మధ్య జరుగుతున్న మ్యాచ్ పై భారత అభిమానులు పీవీ సింధుపై వేల ఆశలు పెట్టుకున్నారు.
పీవీ సింధు వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు సాధించింది.ఈసారి మూడో పతకం సాధించి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. మహిళల సింగిల్స్ గ్రూపులో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ నబ్బా అబ్దుల్ రజాక్‌పై గెలిచి పివి సింధు రెండో రౌండ్‌కి అర్హత సాధించింది. పీవీ సింధు, మాల్దీవులకు చెందిన ఫాతిమత్ నబ్బా అబ్దుల్ రజాక్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. పీవీ సింధు తొలి పాయింట్ సాధించి మ్యాచ్‌ను ప్రారంభించింది. దీని తర్వాత, మార్కుల వ్యత్యాసం క్రమంగా పెరిగింది. తర్వాత ఆమెకు 10 మార్కులు వచ్చాయి. అయితే అబ్దుల్ రజాక్‌కు 4 మార్కులు వచ్చాయి. సింధు 15-5 మరియు 21-9 భారీ తేడాతో గేమ్‌ను సులభంగా గెలుచుకుంది.
తొలి గేమ్‌ను సులువుగా నెగ్గిన సింధు రెండో గేమ్‌లోనూ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అబ్దుల్ రజాక్ పునరాగమనం చేసి 3 పాయింట్లు సాధించి స్కోరును 3-5తో నిలబెట్టింది, అయితే పివి సింధు దూకుడు ప్రదర్శించి స్కోరు లైన్‌ను 10-3 చేయడంతో మళ్లీ పెద్ద ఆధిక్యం సాధించింది. ఇక ఈ తేడా 15-6గా మారడంతో రెండో గేమ్‌లో సింధు విజయానికి చేరువైంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత రెండో గేమ్‌ను 21-6 తేడాతో గెలిచి తన ప్రచారాన్ని ప్రారంభించింది. ఇక సింధు బుధవారం తన తదుపరి గ్రూప్ మ్యాచ్‌లో ఎస్టోనియాకు చెందిన క్రిస్టిన్ కుబాతో ఆడనుంది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.