Rain : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ భారీ వర్ష సూచన..!
ప్రధానాంశాలు:
Rain : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ భారీ వర్ష సూచన..!
Rain : బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఈ ఆవర్తనం ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది మరింత బలపడటానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ ఉపరితల ఆవర్తనం ఈ నెల 5 లేదా 6 తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో 7వ తేదీ నుంచి ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొంది.
ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాల్లో నేడు కూడా ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సైతం తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. ఎవరూ చేపల వేటకు.. సముద్ర స్నానాలకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.