Rain Season : వర్షాకాలంలో మీ కాళ్లు చెడుతున్నాయా… అయితే,ఇదే కారణం…ఈ చిన్న టిప్స్, సమస్య చెక్…?
ప్రధానాంశాలు:
Rain Season : వర్షాకాలంలో మీ కాళ్లు చెడుతున్నాయా... అయితే,ఇదే కారణం...ఈ చిన్న టిప్స్, సమస్య చెక్...?
Rain Season : వర్షాకాలం వచ్చిందంటే రోడ్లంతా తడిగా నీటితో నిండి, బురదను కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి బయటికి వెళ్లాల్సి వస్తే ఆ బురద నీటిలోనే వెళ్లాల్సి వస్తుంది. ఎక్కువసేపు నీటిలో పనిచేయడం వల్ల కూడా కాళ్లు బాగా నానిపోయి, తడి ఎక్కువగా ఉండడం చేత ఆ ప్రదేశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.ఇంకా,వర్షపు నీటిలో నడవడం వలన కాళ్ళని శుభ్రంగా ఉంచుకోకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. శా కాలంలో మీ కాళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్కు గురవాల్సి వస్తుంది కాబట్టి కాళ్ళను బయట నుంచి వచ్చాక శుభ్రంగా కడుక్కోవాలి. పొడిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.వర్షం కాలంలో,కాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సొకకుండా ఉండటానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

Rain Season : వర్షాకాలంలో మీ కాళ్లు చెడుతున్నాయా… అయితే,ఇదే కారణం…ఈ చిన్న టిప్స్, సమస్య చెక్…?
Rain Season కాళ్ళను శుభ్రపరచడం
వర్షాకాలంలో కాళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. కాళ్ళను పొడిగా ఉండేలా చూసుకోవాలి. తడిసిన కాళ్ళను ప్రతిరోజు, తేలికపాటి సబ్బు,గోరువెచ్చని నీటితో మీ కాలను కడుగుతుండాలి. ఇలా చేసినట్లయితే మీ కాళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకవు. వీటినుంచి మీ కాళ్ళను కాపాడుకోవచ్చు.
కాళ్ళను ఆరబెట్టడం : నీ కాళ్ళ పాదాలను ముఖ్యంగా కాలివేల మధ్య మృదువైన టవల్ ఉపయోగించి, పూర్తిగా ఆరబెట్టండి. ఇలా చేస్తే కాళ్లలో నీరు నిలిచిపోకుండా ఉంటుంది. అంటే కాలవేల మధ్యలో నీరు నిలవకుండా తడి లేకుండా చూసుకోవాలి. ఇలా మెత్తటి టవల్ తో తుడిస్తే తడారిపోతుంది. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదాన్ని అరికట్టవచ్చు.
మాయిశ్చరైజింగ్ : చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటుగా ఉంచడానికి తేలికైన జిడ్డులేని మాయిశ్చరైజర్ ని వాడండి. ముఖ్యంగా, మీకు చెమట పట్టే పాదాలు ఉంటే, అదనపు తేమను పీల్చుకోవడానికి యాంటీ ఫంగల్ పౌడర్ని వాడండి.
గోళ్ల సంరక్షణ : మీ కాలి గోళ్ళ కింద మురికి, చెత్త పేరుకు పోకుండా ఉండాలడానికి వాటిని క్రమం తప్పకుండా కత్తిరించాలి. అంటే గోర్లని కత్తిరించాలి.ఇలా చేయకపోతే గోళ్ళల్లో మురికి పేరుకుపోయి, కాళ్లలో ఫంగస్ ని ఏర్పరుస్తుంది. కాబట్టి, గోర్లను అప్పుడప్పుడు కత్తిరిస్తూ ఉండాలి.
వర్షపు నీటిలో లేదా బురద ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడవకండి : ఈ ప్రాంతాలలో లేదా బురద ఉన్న ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడవకండి. మీ పాదాలకు శిలీంద్రాలు,బ్యాక్టీరియాల్ పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఏవైనా కోతలు లేదా గీతలు ఉంటే వెంటనే యాంటీసెప్టిక్ బ్యాండేజ్ తో సరి చేయండి.