YS Sharmila : వైఎస్ షర్మిల పార్టీ పట్టాలెక్కినట్టేనా? పార్టీలో చేరిన తొలి నేత ఈయనే?
YS Sharmila : వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తాను పార్టీ పెడుతున్నట్టు ఆమె ప్రకటించారు. పార్టీకి సంబంధించిన పనుల్లోనూ ఆమె నిమగ్నమైపోయారు. త్వరలో పార్టీ పేరు, విధివిధానాలను షర్మిల ప్రకటించనున్నారు. అయితే.. షర్మిల పార్టీని ప్రకటించకముందే… తన పార్టీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు.
ఇప్పటికే పార్టీ పనుల్లో బిజీగా ఉన్న షర్మిల.. పార్టీలోకి ఓ నాయకుడిని తీసుకున్నారు. చాలామంది పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. పార్టీలో ఆమె ఎవ్వరినీ చేర్చుకోవడం లేదు. పార్టీ ప్రకటన తర్వాతే షర్మిల పార్టీలో చేరికలు ఉండొచ్చు. కానీ.. పార్టీ పేరు ప్రకటించకున్నా.. ఇప్పటికే వైఎస్సార్ అభిమానులతో, ఇతర నేతలతో ఆమె టచ్ లో ఉన్నారు. వాళ్ల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఎలా ముందుకెళ్లాలి? పార్టీ పేరు ఏదైనా బాగుంటుంది? పార్టీ విధివిధానాలు ఏవి ఉండాలి? అనే వాటిపై ఆమె చర్చలు జరుపుతున్నారు.
YS Sharmila : షర్మిల పార్టీలో చేరిన రాజగోపాల్
అయితే.. పార్టీ విధివిధానాల కోసం.. పార్టీ పేరు కోసం.. పార్టీని వెనక ఉండి నడిపించే నేతల కోసం ఆమె కొందరు నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఈనేపథ్యంలో.. పార్టీలో తొలి వ్యక్తిగా హైదరాబాద్ కు చెందిన రాజగోపాల్ అనే నేతను షర్మిల పార్టీలో చేర్చుకున్నారు.
ఆయన్ను తన పార్టీ ప్రకటన ఇన్ చార్జ్ గా షర్మిల నియమించారు. రాజగోపాల్.. వైఎస్సార్ రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటి నుంచి ఆయనతో, వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అందుకే.. ఆయన్ను షర్మిల తన పార్టీలో తొలి నేతగా తీసుకున్నారు.
షర్మిల ఊ.. అంటే పార్టీలో చేరేందుకు చాలామంది నేతలు ఉత్సుకత చూపిస్తున్నా.. షర్మిల మాత్రం పార్టీకి తొలి నేతగా.. రాజగోపాల్ ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ పేరు ప్రకటన కోసం, పార్టీ విధివిధానాల కోసం ఆయన పని చేయనున్నట్టు తెలుస్తోంది.
పార్టీలోకి నేతలను షర్మిల ఆహ్వానిస్తున్నారంటే.. త్వరలోనే ఆమె పార్టీ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే.. పార్టీ ప్రకటన తర్వాత టీఆర్ఎస్ నేతలు చాలామంది షర్మిల పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట.