Ram charan : వాడ్ని అలా వదిలేద్దాం.. బుచ్చిబాబుకు రామ్ చరణ్ రికమండేషన్
Ram charan : ‘ఉప్పెన’ ప్రయాణం ఎంతో చిత్రవిచిత్రంగా మొదలైంది. సుకుమార్ దగ్గర శిష్యరికం చేస్తోన్న సమయంలోనే కథను పూర్తి చేసేశాడు బుచ్చిబాబు సానా. నాన్నకు ప్రేమతో సమయంలోనే ఆ లైన్‌ను, కథను ఎన్టీఆర్‌కు వినిపించాడట. అప్పటి నుంచి ఆ కథతో ఎన్టీఆర్ కూడా ట్రావెల్ అయ్యేవాడట. అయితే ఈ కథకు హీరోగా వైష్ణవ్ తేజ్‌ను అనుకున్న బుచ్చిబాబు.. మెగా కాంపౌండ్‌లోకి ఎలా వెళ్లాలో అర్థం కాక సుకుమార్ వద్దకు వెళ్లాడట.
చిరంజీవి గారి వద్దకు వెళ్లి కథ చెబుదామా? అని సుకుమార్‌ను బుచ్చిబాబు అడిగాడట. అయితే మెగా ఫ్యామిలీలో మనకు రామ్ చరణ్ కంటే క్లోజ్ ఎవర్రా? మొదటగా ఆయన దగ్గరకు వెళ్దాం పదా అని బుచ్చిబాబును చెర్రీ వద్దకు తీసుకెళ్లాడట సుకుమార్. అక్కడ ఆయనకు కథ చెప్పాక వినిపించాక.. మా ఇంట్లో ఇంత మంది ఉన్నాక ఈ కథను నాతోనే ఎందుకు చేయాలని అనిపించిందని రామ్ చరణ్ అడిగాడట. అది మీ కోసం రాసిన కథ కాదు.. వైష్ణవ్ తేజ్ కోసం రాసిందని అసలు విషయం చెప్పాడట.
Ram charan : బుచ్చిబాబుకు రామ్ చరణ్ రికమండేషన్
అయితే ఆ సమయంలో జార్జియాలో ఉన్న చిరంజీవికి ఉప్పెన గురించి రామ్ చరణ్ చెప్పాడట. వాడు బాగా తీస్తాడు.. వాడ్ని అలా వదిలేద్దాం అంటూ చిరంజీవికి బుచ్చిబాబు గురించి రామ్ చరణ్ రికమండ్ చేశాడట. ఈ విషయాలన్నీ బుచ్చిబాబు నిన్న ఉప్పెన సక్సస్ మీట్‌లో చెప్పుకొచ్చాడు. దీంతో ఉప్పెన వెనక చాలా విషయాలే జరిగాయని అర్థమవుతోంది. పైగా ఉప్పెన కథను చిరంజీవి దగ్గరుండి మరీ నాలుగైదు సార్లు విన్నాడట.