Ramoji Rao : హమ్మయ్య .. రామోజీరావు ఇవాళ రాత్రి నుంచి ప్రశాంతంగా పడుకుంటాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ramoji Rao : హమ్మయ్య .. రామోజీరావు ఇవాళ రాత్రి నుంచి ప్రశాంతంగా పడుకుంటాడు..!

 Authored By gatla | The Telugu News | Updated on :28 August 2022,7:40 pm

Ramoji Rao : ఎంత డబ్బు ఉన్నా.. ఎంతో హోదా ఉన్నా.. ఎంత పలుకుబడి ఉన్నా.. చేతిలో పవర్ ఉన్నా కూడా ఒక్కోసారి ఏదైనా అనుకున్న పని వెంటనే జరగదు. కొన్ని కోరికలు కొందరికి అస్సలు తీరవు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా.. ఎంత పలుకుబడి ఉన్నా వృథానే అవుతుంది. అలాంటి తీరని కోరిక ఒకటి ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీ రావుకు ఉండేదట. ఆయనకు ఎన్ని తీరని కోరికలు ఉన్నాయో కానీ.. వైజాగ్ లో మాత్రం ఒక తీరని కోరిక అలాగే ఉండిపోయిందట. ఆ కోరిక తీరడానికి దశాబ్దలు పట్టింది. వైజాగ్ లో డాల్ఫిన్ అనే హోటల్ ను రామోజీ రావు దాదాపు నాలుగు దశాబ్దాల కింద నిర్మించారు. ఆ హోటల్ పక్కనే ఊటీ అనే మరో హోటల్ ఉంది. డాల్ఫిన్ హోటల్ ను నిర్మించిన తర్వాత కొన్నేళ్లకే ఊటీ హోటల్ ను రామోజీరావుకే విక్రయించేసింది ఊటీ యాజమాన్యం.

అయితే.. ఇక్కడ ఉన్న అసలు ట్విస్ట్ ఏంటంటే.. డాల్ఫిన్, ఊటీ హోటల్ మధ్య ఉన్న దూరం ఒక అడ్డ రోడ్డు. అది కూడా కేవలం ఓ 10 నుంచి 15 అడుగుల దూరం ఉంటుంది. ఆ దారి డాల్ఫిన్ హోటల్ ది కాదు. ఊటీ హోటల్ ది కాదు. అక్కడే ఉన్న జ్యోతి అనే థియేటర్ కు వెళ్లే ప్రైవేటు దారి అది. అది జ్యోతి థియేటర్ కు చెందిన సొంత దారి. ఆ దారి కనుక రామోజీ రావుకు ఇస్తే డాల్ఫిన్, ఊటీ రెండు హోటల్స్ కలిసిపోయినట్టే. కాకపోతే జ్యోతి థియేటర్ యాజమాన్యం ఆ ప్లేస్ ను రామోజీకి అమ్మేందుకు ఒప్పుకోలేదు.

Ramoji Rao Dream Fulfilled Jyothi Theatre Issue

Ramoji Rao Dream Fulfilled Jyothi Theatre Issue

Ramoji Rao :  థియేటర్ ను రామోజీ రావుకు కాకుండా రామానాయుడుకు అమ్మేసిన జ్యోతి యాజమాన్యం

అయితే.. రామోజీకి కనీసం ఆ రోడ్డును అమ్మలేదు.. థియేటర్ ను కూడా అమ్మలేదు కానీ.. జ్యోతి థియేటర్ యాజమాన్యం చివరకు ఆ థియేటర్ ను ప్రముఖ నిర్మాత రామానాయుడుకు అమ్మేసింది. అప్పటికీ ఆ హోటల్స్ మధ్య ఉన్న రోడ్డు గ్యాప్ మాత్రం అలాగే ఉండిపోయింది. చివరకు ఆ థియేటర్.. సురేశ్ బాబు చేతుల్లోకి వెళ్లింది. ఇటీవల జ్యోతి థియేటర్ ను సురేశ్ బాబు.. వేరే వాళ్లకు అమ్మేశాడు. ఇప్పుడు కూడా ఆ థియేటర్ ను రామోజీ రావు దక్కించుకోలేకపోయారు కానీ.. దాన్ని విజయనగరానికి చెందిన కొందరు వ్యాపారులు రూ.35 కోట్లుకు కొనేశారట.

కాకపోతే డాల్ఫిన్ హోటల్, ఊటీ హోటల్ మధ్య ఉన్న ప్రైవేట్ రోడ్డును మాత్రం వాళ్లు రామోజీకి అమ్మేసిన‌ట్లు స‌మాచారం.. దీంతో రామోజీ కోరిక ఇప్పుడు తీరినట్టు ఇన్‌సైడ్ టాక్‌. రూ.5 కోట్లకు ఆ రోడ్డును రామోజీకి వాళ్లు అమ్మేసిన‌ట్లు స‌మాచారం. దీంతో తన దశాబ్దాల కోరిక తీరిన‌ట్లు తెలుస్తుంది. రూ.35 కోట్లకు కొని రూ.5 కోట్లకు రోడ్డును అమ్మేసి చివరకు రూ.30 కోట్లకు థియేటర్ ను దక్కించుకున్న వాళ్లు.. జ్యోతి థియేటర్ ను కూలగొట్టి అక్కడ అపార్ట్ మెంట్ కట్టేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది