Ramoji Rao : ఎంత డబ్బు ఉన్నా.. ఎంతో హోదా ఉన్నా.. ఎంత పలుకుబడి ఉన్నా.. చేతిలో పవర్ ఉన్నా కూడా ఒక్కోసారి ఏదైనా అనుకున్న పని వెంటనే జరగదు. కొన్ని కోరికలు కొందరికి అస్సలు తీరవు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా.. ఎంత పలుకుబడి ఉన్నా వృథానే అవుతుంది. అలాంటి తీరని కోరిక ఒకటి ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీ రావుకు ఉండేదట. ఆయనకు ఎన్ని తీరని కోరికలు ఉన్నాయో కానీ.. వైజాగ్ లో మాత్రం ఒక తీరని కోరిక అలాగే ఉండిపోయిందట. ఆ కోరిక తీరడానికి దశాబ్దలు పట్టింది. వైజాగ్ లో డాల్ఫిన్ అనే హోటల్ ను రామోజీ రావు దాదాపు నాలుగు దశాబ్దాల కింద నిర్మించారు. ఆ హోటల్ పక్కనే ఊటీ అనే మరో హోటల్ ఉంది. డాల్ఫిన్ హోటల్ ను నిర్మించిన తర్వాత కొన్నేళ్లకే ఊటీ హోటల్ ను రామోజీరావుకే విక్రయించేసింది ఊటీ యాజమాన్యం.
అయితే.. ఇక్కడ ఉన్న అసలు ట్విస్ట్ ఏంటంటే.. డాల్ఫిన్, ఊటీ హోటల్ మధ్య ఉన్న దూరం ఒక అడ్డ రోడ్డు. అది కూడా కేవలం ఓ 10 నుంచి 15 అడుగుల దూరం ఉంటుంది. ఆ దారి డాల్ఫిన్ హోటల్ ది కాదు. ఊటీ హోటల్ ది కాదు. అక్కడే ఉన్న జ్యోతి అనే థియేటర్ కు వెళ్లే ప్రైవేటు దారి అది. అది జ్యోతి థియేటర్ కు చెందిన సొంత దారి. ఆ దారి కనుక రామోజీ రావుకు ఇస్తే డాల్ఫిన్, ఊటీ రెండు హోటల్స్ కలిసిపోయినట్టే. కాకపోతే జ్యోతి థియేటర్ యాజమాన్యం ఆ ప్లేస్ ను రామోజీకి అమ్మేందుకు ఒప్పుకోలేదు.
అయితే.. రామోజీకి కనీసం ఆ రోడ్డును అమ్మలేదు.. థియేటర్ ను కూడా అమ్మలేదు కానీ.. జ్యోతి థియేటర్ యాజమాన్యం చివరకు ఆ థియేటర్ ను ప్రముఖ నిర్మాత రామానాయుడుకు అమ్మేసింది. అప్పటికీ ఆ హోటల్స్ మధ్య ఉన్న రోడ్డు గ్యాప్ మాత్రం అలాగే ఉండిపోయింది. చివరకు ఆ థియేటర్.. సురేశ్ బాబు చేతుల్లోకి వెళ్లింది. ఇటీవల జ్యోతి థియేటర్ ను సురేశ్ బాబు.. వేరే వాళ్లకు అమ్మేశాడు. ఇప్పుడు కూడా ఆ థియేటర్ ను రామోజీ రావు దక్కించుకోలేకపోయారు కానీ.. దాన్ని విజయనగరానికి చెందిన కొందరు వ్యాపారులు రూ.35 కోట్లుకు కొనేశారట.
కాకపోతే డాల్ఫిన్ హోటల్, ఊటీ హోటల్ మధ్య ఉన్న ప్రైవేట్ రోడ్డును మాత్రం వాళ్లు రామోజీకి అమ్మేసినట్లు సమాచారం.. దీంతో రామోజీ కోరిక ఇప్పుడు తీరినట్టు ఇన్‌సైడ్ టాక్. రూ.5 కోట్లకు ఆ రోడ్డును రామోజీకి వాళ్లు అమ్మేసినట్లు సమాచారం. దీంతో తన దశాబ్దాల కోరిక తీరినట్లు తెలుస్తుంది. రూ.35 కోట్లకు కొని రూ.5 కోట్లకు రోడ్డును అమ్మేసి చివరకు రూ.30 కోట్లకు థియేటర్ ను దక్కించుకున్న వాళ్లు.. జ్యోతి థియేటర్ ను కూలగొట్టి అక్కడ అపార్ట్ మెంట్ కట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.