Ramoji Rao : జగన్ విషయంలో అట్టర్ ఫ్లాప్ గా మిగిలిన రామోజీరావు.. ఈ దెబ్బ మామూలుది కాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ramoji Rao : జగన్ విషయంలో అట్టర్ ఫ్లాప్ గా మిగిలిన రామోజీరావు.. ఈ దెబ్బ మామూలుది కాదు

Ramoji Rao : ఈనాడు రామోజీ రావు గురించి తెలుసు కదా. ఎల్లో మీడియా పేరుతో ఆయన పత్రికలో వచ్చే కథనాల గురించి కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు.. గత 40 ఏళ్ల నుంచి ఈనాడు పత్రిక ఎవరికి అనుకూలంగా వార్తలు రాస్తుందో కూడా అందరికీ తెలుసు. ఈనేపథ్యంలో రామోజీ రావు తాజాగా ఉపయోగిస్తున్న స్ట్రాటజీ ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది. అది కూడా సీఎం జగన్ మీద ప్రయోగిస్తున్న ఆయన స్ట్రాటజీ ఎలా ఫెయిల్ అయింది. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :15 October 2022,1:30 pm

Ramoji Rao : ఈనాడు రామోజీ రావు గురించి తెలుసు కదా. ఎల్లో మీడియా పేరుతో ఆయన పత్రికలో వచ్చే కథనాల గురించి కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు.. గత 40 ఏళ్ల నుంచి ఈనాడు పత్రిక ఎవరికి అనుకూలంగా వార్తలు రాస్తుందో కూడా అందరికీ తెలుసు. ఈనేపథ్యంలో రామోజీ రావు తాజాగా ఉపయోగిస్తున్న స్ట్రాటజీ ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది. అది కూడా సీఎం జగన్ మీద ప్రయోగిస్తున్న ఆయన స్ట్రాటజీ ఎలా ఫెయిల్ అయింది. ఎందుకు జగన్ విషయంలో రామోజీ రావు అట్టర్ ఫ్లాప్ అయ్యారో తెలుసుకుందాం రండి. మీకు గుర్తుందా? 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలిచి తన సత్తా చాటి ముఖ్యమంత్రి అయ్యారు.

తొలిసారి ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు. ఆ తర్వాత ఆయన చాలా పథకాలు ప్రారంభించారు. ప్రజలు అభిమానించే ముఖ్యమంత్రి అయ్యారు. ఇదంతా నచ్చక ఎన్నికలకు మరో ఏడాది ఉందనగా.. ఈనాడులో పెద్దలా గద్దలా పేరుతో పలు కథనాలు వరుసగా అచ్చయ్యాయి. అవన్నీ అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పలు పథకాల్లో అవినీతి ఉందంటూ వాటిపై వరుసగా కథలను వండి వార్చారు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ఉందనగా ప్రారంభించి చివరకు ఎన్నికల వరకు కూడా వరుసగా కథనాలను అచ్చేశారు. అంత జరిగినా.. పత్రికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీకి, వైఎస్సార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వచ్చినా ఏపీ ప్రజలు తిరిగి వైఎస్సార్ నే ముఖ్యమంత్రిగా గెలిపించారు.

ramoji rao strategy utter flop on ap cm ys jagan

ramoji rao strategy utter flop on ap cm ys jagan

Ramoji Rao : 2009 ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్ నే గెలిపించిన ఏపీ ప్రజలు

అంటే.. రామోజీ రావు అక్కడే అట్టర్ ఫ్లాప్ అయ్యారన్నమాట. తిరిగి మళ్లీ ఇప్పుడు ఎన్నికలకు ఇంకో రెండేళ్ల సమయం ఉందనగానే.. మరోసారి తన సేమ్ స్ట్రాటజీని ప్రారంభించారు రామోజీ రావు. జగన్ కు వ్యతిరేకంగా మళ్లీ తన పత్రికలో రాజధానిపై జగన్నాటకం పేరుతో కథనాలను వండి వార్చుతున్నారు. అయితే.. ఇదంతా టీడీపీ స్ట్రాటజీ అని తెలుస్తోంది. కానీ.. సీఎం జగన్ పై వేస్తున్న కథనాలు పచ్చి అబద్ధాలని అందరూ తేల్చేస్తున్నారు. అలాగే.. ఎవరైనా ఎన్నికలకు ముందు ఇలా చేస్తారు కానీ..ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉందనగా ఇలాంటి స్ట్రాటజీలు ఎందుకు.. అప్పటి వరకు జనాలు ఇవన్నీ మరిచిపోతారు. జగన్ విషయంలోనూ రామోజీ రావు మరోసారి అట్టర్ ఫ్లాప్ అయ్యారంటూ రాజకీయవేత్తలు చెబుతున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది