Ration Card : రేషన్ కార్డుదారులకు అలర్ట్.. సరుకులు రావాలంటే నవంబర్ 15లోపు ఇలా చేయండి..!
ప్రధానాంశాలు:
Ration Card : రేషన్ కార్డుదారులకు అలర్ట్.. సరుకులు రావాలంటే నవంబర్ 15లోపు ఇలా చేయండి..!
Ration Card : రేషన్ కార్డ్ హోల్డర్స్ అంతా కూడా తమకు రావాల్సిన రేషన్ సామాగ్రిని పొందాలంటే ఈ కేవైసీని పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి రేషన్ సరఫరా నిలిపి వేసే అవకాశం ఉంటుంది. రేషన్ ఈ కేవైసీ పూర్తి చేయని వారికి ఇక మీదట ఆ ప్రయోజనాలు దక్కవని తెలుస్తుంది. రేషన్ కార్డ్ హోల్డర్లకు ఈ కేవైసీ వెరిఫికేషన్ ఎందుకు తప్పనిసరి అంటే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పౌరులకు ప్రాధమిక అవసరంగా వివిధ పథకాలు అందిస్తారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన ఫ్యామిలీస్ కు బియ్యం, గోధుమలు, ఇతర నిత్యావసరాలు సబ్సీడీ రేషన్ వస్తువులు అందిస్తారు. పంపిణీ ప్రక్రియ క్రమబద్ధీకరణ చేయడానికి మోసాలు నివారించడానికి ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ 100 శాతం ఈ కేవైసీ ధృవీకరణ అవసరం అనుకుంటారు.
Ration Card E KYC ప్రక్రియ పూర్తైన వారికి రేషన్ పంపిణీ..
ముఖ్యంగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తైన వారికి రేషన్ పంపిణీ కొనసాగుతుంది ఐతే రేషన్ కార్డు దారులు ఈ కేవైసీ అశలను అనుసరించాల్సి ఉంటుంది. ముందు అక్టోబర్ 31, 2024 కల్లా ప్రతి ఒక్కరు ఈ కేవైసీని పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఐతే మళ్లీ గడువు తేదీ పెంచుతూ నవంబర్ 15 వరకు ఆ అవకాశం ఇచ్చారు.
రేషన్ కార్డ్ దారులంతా కూడా ఈ కేవైసీ పూర్తి చేయాలంటే ఉచితంగా ప్రాథమిక బయోమెట్రిక్ ప్రమాణీకరణ మాత్రమే అవసరం చేయాల్సి ఉంది. ఆధీకృత రేషన్ షాపుల్లో ఈ కేవైసీ పూర్తి చేయొచ్చు. అక్కడ వేలిముద్రతో స్కాన్ చేసి ఈ గుర్తింపు పొందవచ్చు. మీ ఈ పాస్ ఆధార్ కార్డ్ ద్వారా దీన్ని వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. దీనితో పాటుగా ఈ కేవైసీ చేసేప్పుడు మీ మొబైల్ నంబర్ ని లింక్ చేయాలి.