Andhra Pradesh Ration Shops | ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ వ్యవస్థ మార్పు .. మినీ మాల్స్ ద్వారా రోజుకు 12 గంటల పాటు సేవలు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Andhra Pradesh Ration Shops | ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ వ్యవస్థ మార్పు .. మినీ మాల్స్ ద్వారా రోజుకు 12 గంటల పాటు సేవలు!

 Authored By sandeep | The Telugu News | Updated on :11 October 2025,5:21 pm

Andhra Pradesh Ration Shops | రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇకపై రేషన్ దుకాణాలు నెలలో కొన్ని రోజులే కాకుండా, రోజుకు 12 గంటల పాటు సేవలు అందించనున్నాయి. ఈ కొత్త విధానాన్ని తొలుత తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ రూపంలో ప్రారంభించనున్నారు.

#image_title

మినీ మాల్స్‌గా

ప్రస్తుతం రేషన్ షాపులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు మాత్రమే తెరిచి ఉండగా, ఇకపై ఇవే షాపులు మినీ మాల్స్‌గా మారి రోజుకు 12 గంటలు అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రజలకు మరింత సౌకర్యం కలగనుంది.

తిరుపతిలో 15 రేషన్ దుకాణాలను మినీ మాల్స్‌గా మార్చేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శేషాచలం రాజు తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటికే ఈ దుకాణాలను ఎంపిక చేసి, పూర్తి ప్రణాళికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ప్రస్తుత పైలట్ ప్రాజెక్ట్‌లో మొత్తం 75 రేషన్ షాపులను, ప్రతి నగరంలో 15 చొప్పున ఎంపిక చేశారు. ఈ మినీ మాల్స్‌లో కేవలం రేషన్ బియ్యం మాత్రమే కాకుండా, ఇతర నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం జాతీయ వ్యవసాయ సహకార సొసైటీ (NAFED), గిరిజన సహకార సంస్థల సహకారంతో సరుకులను అందించనున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది