
#image_title
Andhra Pradesh Ration Shops | రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇకపై రేషన్ దుకాణాలు నెలలో కొన్ని రోజులే కాకుండా, రోజుకు 12 గంటల పాటు సేవలు అందించనున్నాయి. ఈ కొత్త విధానాన్ని తొలుత తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ రూపంలో ప్రారంభించనున్నారు.
#image_title
మినీ మాల్స్‌గా
ప్రస్తుతం రేషన్ షాపులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు మాత్రమే తెరిచి ఉండగా, ఇకపై ఇవే షాపులు మినీ మాల్స్‌గా మారి రోజుకు 12 గంటలు అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రజలకు మరింత సౌకర్యం కలగనుంది.
తిరుపతిలో 15 రేషన్ దుకాణాలను మినీ మాల్స్‌గా మార్చేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శేషాచలం రాజు తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటికే ఈ దుకాణాలను ఎంపిక చేసి, పూర్తి ప్రణాళికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ప్రస్తుత పైలట్ ప్రాజెక్ట్‌లో మొత్తం 75 రేషన్ షాపులను, ప్రతి నగరంలో 15 చొప్పున ఎంపిక చేశారు. ఈ మినీ మాల్స్‌లో కేవలం రేషన్ బియ్యం మాత్రమే కాకుండా, ఇతర నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం జాతీయ వ్యవసాయ సహకార సొసైటీ (NAFED), గిరిజన సహకార సంస్థల సహకారంతో సరుకులను అందించనున్నారు.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.