Ravi Teja : ర‌వితేజ‌.. చిరంజీవి సవతి తల్లి కొడుకా?.. నోరెళ్ల‌పెడుతున్న నెటిజ‌నం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ravi Teja : ర‌వితేజ‌.. చిరంజీవి సవతి తల్లి కొడుకా?.. నోరెళ్ల‌పెడుతున్న నెటిజ‌నం

 Authored By sandeep | The Telugu News | Updated on :27 July 2022,5:45 pm

Ravi Teja : ఆచార్య సినిమాతో ఇటీవ‌ల ప‌ల‌క‌రించిన చిరంజీవి ఇప్పుడు ప‌లు చిత్ర షూటింగ్స్‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదళం మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో కూడా చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు టైటిల్ ఫిక్స్ కానీ ఈ మూవీ మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ ను జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో క‌నిపంచ‌నున్నాడు. చిత్రంలో రవితేజ పోషించబోయే పాత్ర ఇదేనంటూ.. ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చిరంజీవి తమ్ముడిగా రవితేజ కనిపించబోతున్నాడట. సవతి తల్లి కొడుకైన రవితేజతో చిరంజీవికి వైర్యం ఏర్పడుతుదంట. ఇద్దరి పాత్రల మధ్య ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయట.

ravi teja news to be brother of chiranjeevi

ravi teja news to be brother of chiranjeevi

చిరంజీవిని రవితేజ సొంత అన్నయ్యలా భావిస్తాడు. గతంలో వీరిద్దరు అన్నాదమ్ములుగా ‘అన్నయ్య’ చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు కూడా మెగాస్టార్‌కు మాస్‌ మహారాజా తమ్ముడిగా నటిస్తున్నాడని అంటున్నారు. ఈ వార్త‌ల‌లో నిజమెంత ఉంద‌నేది రానున్న రోజుల‌లో తెలియ‌నుంది. ఇటీవ‌లే ర‌వితేజ మూవీ సెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సమ‌యంలో ఒక వీడియో కూడా విడుద‌ల చేశారు. అలాగే ఈ మూవీ లో సీనియర్ స్టార్ హీరోయిన్ సుమలత కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సుమలత , రవితేజ తల్లిగా కనిపించబోతున్నట్లు స‌మాచారం.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది