RBI : లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్ ..? వడ్డీ రేట్లు ఎప్పటి వరకు పెరగవంటే..
RBI : ఆర్బీఐ ముఖ్యమైన నిర్ణయం తీసుకోనుందా? వచ్చే పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచుతుందా? అందుకు సంబంధించిన కొన్ని నివేదికలు వచ్చారు. వాటిని ఒక సారి గమనిస్తే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమీక్షలు ఫిబ్రవరి 7న మొదలుకావాలి. కానీ ప్రముఖ సింగర్ లతామంగేష్కర్ చనిపోయిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ఆ రోజున సెలవు ప్రకటించింది. దీంతో ఆర్బీఐ బ్రాంచులు సైతం సెలవులోనే ఉంటాయి. ఫిబ్రవరి 10న రివర్స్ రెపో రేటు ప్రకటించే చాన్స్ ఉందని పలువురు భావిస్తున్నారు.
రివర్స్ రెపో రేటును 0.20 నుంచి 0.40 శాతం వరకు పెంచే చాన్స్ ఉందని నివేదికలను బట్టి చూస్తే తెలుస్తున్నది.కరోనా వైరస్ నేపథ్యంలో వృద్ధికి దోహదపడే విధంగా వడ్డీ రేట్లను ఆర్బీఐ గతంలో తగ్గించింది. రెపో రేటు చాలా కాలంగా 4 శాతంగానే కొనసాగుతోంది. 2020 మే నుంచి ఇదే కొనసాగుతున్నది. రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద ఉంది.రెపో రేటు, రివర్స్ రేటు మధ్య వ్యత్యాసం సాధారణంగా 25 బేసిస్ పాయింట్ల వరకు ఉంటుంది. కరోనా నేపథ్యంలో రెండింటి మధ్య వ్యత్యాసం 65 బేసిస్ పాయింట్లకు పెరిగింది.
RBI : ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో..?
ఇప్పుడు ఈ గ్యాప్‌ను 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించుకోవాలని ఆర్బీఐ భావిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. మరి దీనిపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా.. ఆర్‌బీఐ రెపో రేటును యాథతథంగానే కొనసాగించొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ భావిస్తోంది. దీని వల్ల హోమ్, వెహికల్ లోన్లు తీసుకునే వారికి ప్రయోజనం చేకూరనున్నట్టు తెలిపింది. ఇవి ఏప్రిల్ వరకు పెరగక పోవచ్చని అంచనా వేసింది. మరి గురువారం రోజున ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేస్తుందని విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది.