RBI : బ్యాంక్‌లని హెచ్చరించిన రిజర్వ్ బ్యాంక్… ఈఎంఐ కట్టని వారికి ఇది గుడ్ న్యూసే..!
ప్రధానాంశాలు:
RBI : బ్యాంక్‌లని హెచ్చరించిన రిజర్వ్ బ్యాంక్... ఈఎంఐ కట్టని వారికి ఇది గుడ్ న్యూసే..!
RBI : అత్యవసరంగా డబ్బు అవసరం అయినా.. బయట ఇంట్రెస్ట్ రేటు అధికంగా ఉంటుందనే కారణంతో చాలా మంది బ్యాంకులు, నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీల దగ్గర నుంచి రుణాలు తీసుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకుని.. ప్రతి నెల కొద్ది కొద్దిగా ఈఎంఐ రూపంలో చెల్లించే వెసులుబాటు ఉండటం వల్ల చాలా మంది దీనికే మొగ్గు చూపుతారు. అయితే ఈఎంఐ చెల్లింపుల్లో ఏమాత్రం ఆలస్యం జరిగినా.. ఆయా సంస్థలు కస్టమర్లకు చుక్కలు చూపిస్తాయి. ఫైన్ల పేరుతో భారీగా దండుకుంటాయి. అదుగో వాటికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది.
RBI రిజర్వ్ బ్యాంక్ సీరియస్..
సాధారణంగా రుణాలు చెల్లించని పక్షంలో బ్యాంకులు వారి ఏజెంట్లని పంపి వాహనాన్ని జప్తి చేయమని వారికి సూచిస్తాయి. ఆర్‌బీఐ కొత్త రూల్స్ ప్రకారం ఇప్పటి నుండి ఏ వాహనం కూడా జప్తు చేయబడదు. ఎవరైన అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.రుణ గ్రహీత తన వాహనంపై తీసుకున్న రుణాన్ని తిరిగి ఇవ్వలేనప్పుడు బ్యాంకులు ఆర్ధిక సంస్థలు డబ్బు వసూలు చేయడానికి తమ సేకరణ ఏజెంట్స్ పంపుతాయి. ఒకవేళ మీతో వారు అమర్యాదగా ప్రవర్తిస్తే వారిపై ఫిర్యాదు చేయవచ్చు. ఎఫ్ఐఆర్ ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు లక్ష జరిమానా విధిస్తారు.
సాధారణంగా నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ మెుత్తాన్ని ఆలస్యంగా చెల్లించినందుకు బ్యాంకులు ఖాతాదారుల నుంచి జరిమానా వసూలు చేస్తాయి. అయితే ఆర్‌బీఐ కొత్త ఆదేశాల వల్ల ఇకపై బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు.. ఈఎంఐ ఆలస్యంపై జరిమానా, వడ్డీని వసూలు చేయకుండా నిరోధిస్తుంది. లోన్ డిఫాల్ట్ సమయంలో వడ్డీ రేటుకు అదనపు ఛార్జీలను జోడించటాన్ని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే నిషేధించింది. పెనాల్టీ ఛార్జీలపై ఎలాంటి అదనపు వడ్డీని వసూలు చేయవద్దని బ్యాంకులను కోరింది. గత కొంత కాలంగా ఇలాంటి సంఘటనలపై ఫిర్యాదులు పెరగటంతో రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగింది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకుంది.