RBI : ఆర్బీఐ గుడ్ న్యూస్.. కీలక ప్రకటన వచ్చేసింది..
RBI : ఆర్థిక లావాదేవీల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఎప్పటికప్పుడు దేశ ఆర్థిక పెరుగుదల, తలసరి ఆదాయాలను బట్టి ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానో మరోసారి వ్యాపారస్తులకు ఆర్బీఐ మంచి న్యూస్ చెప్పింది.ఈ మేరకు తీపికబురు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఉన్న న్యాక్ మ్యాండెడ్ లిమిట్ ను అమాంతం పెంచేశారు. ఇప్పటి దాకా రూ.కోటి ఉన్నటువంటి ఈ లిమిట్ ను ఏకంగా రూ.3 కోట్ల దాకా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
అయతే ఈ నిర్ణయాన్ని కంపెనీల నుంచి వచ్చిన విన్నపాలను దృష్టిలో పెట్టుకుని ఎంఎస్ఎంఈలకు పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. అయితే దీంతో పాటు ఆర్బీఐ మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ఇరూపీ వోచర్ లిమిట్ ను కూడా పెంచుతున్నట్టు వెల్లడించింది. ఇది కంపెనీలకు కాకుండా కేంద్రం, రాష్ట్ర ప్రబుత్వాల స్కీములను మరింత లాభం చేకూర్చే విధంగా ఉంటుందని చెబుతున్నారు శక్తికాంత దాస్. దీన్ని రూ.10 వేల నుంచి రూ. లక్ష దాకా పెంచుతున్నట్టు ఆయన వెల్లడించారు.
RBI : వడ్డీ రేట్లు యథాతథం..
అయితే వీటిని అమలు చేసేందుకు తక్షణమే ఎన్‌పీసీఐకి ఆర్డర్స్ కూడా ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. ఇక ఇరూపీ వోచర్‌ను వాడేందుకు ఉన్న లిమిట్స్‌ను తొలగించి, ఎన్ని సార్లు అయినా యూస్ చేసుకనేలా దీన్ని రూపొందించినట్టు ఆయన ప్రకటించారు. ఇక మరో విషయం ఏంటంటే.. వడ్డీ రేట్లను మరోసారి కూడా స్థిరంగానే ఉంచింది ఆర్బీఐ. రెపో, రివర్స్ రెపో రేట్లను మాత్రం ఎప్పటిలాగే తటస్తంగా ఉంచారు. రెపో రేమటు 4 శాతంగా ఉంటే.. రివర్స్ రెపో రేటు మాత్రం 3.35 శాతం లాగే కొనసాగుతున్నాయి.