Rbi : రూ.10 వేలకు మించి విత్ డ్రా చేసుకోవడం కుదరదు.. ఆర్బీఐ షాకింగ్ న్యూస్..!
Rbi : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంటూ ఓ బ్యాంక్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ బ్యాంకుకు చెందిన ఖాతాదారులంతా పరిమితికి మించి నగదును విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేదని చెబుతూ కస్టమర్లకూ ఝలక్ ఇచ్చింది. ఇంతకీ ఆర్బీఐ ఆ బ్యాంక్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించడానికి కారణం ఏంటో తెలుసు కోవాలనుందా…? అయితే ఈ వార్త పూర్తిగా చదవండి.రిజర్వు బ్యాంక్ నగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌కు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పి ఒక్కసారిగా షాకిచ్చింది.ఆ బ్యాంక్ కు చెందిన కస్టమర్లంతా రోజుకు రూ.10 వేలకు మించి డబ్బులు విత్ డ్రా చేసుకోవడం కుదరదని బాంబు పేల్చింది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంక్ యొక్క ఆర్థిక పరిస్థితులు క్షీణించడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకొచ్చింది. ఈ ఆంక్షలు డిసెంబర్ 6 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించిన ఆర్బీఐ… వచ్చే ఆరు నెలల వరకు అమలులోనే ఉంటాయని స్పష్టం చేసింది. గడువు ముగిసిన అనంతరం… సమీక్ష చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తమ అనుమతి లేనిదే బ్యాంక్ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆర్‌బీఐ హెచ్చరించింది. రుణాలు అందించడం కూడా కుదరదని చెప్పింది. మరోవైపు డిపాజిట్లు కూడా స్వీకరించ వద్దని తెలిపింది.
Rbi : నగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్:
ప్రాపర్టీ లేదా అసెట్స్‌ను అమ్మకూడదని స్పష్టం చేసింది. ఈ విషయాల్లో బ్యాంక్ కు ఏదైనా సందేహం ఉంటే… తప్పక తమ అనుమతి తీసుకోవాలని ఆర్బీఐ ప్రకటించింది ఆర్‌బీఐ తాజా నిర్ణయాలతో నగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులంతా విస్తుపోయారు. వారి వారి బ్యాంక్ ఖాతాల్లో ఎంత నగదు ఉన్నప్పటికీ… రూ.10 వేలకు మించి తీసుకోవడం కుదరదని తెగేసి చెప్పడంతో షాక్ కు గురయ్యారు.