
rbi has good news for the industry a key announcement
Rbi : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంటూ ఓ బ్యాంక్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ బ్యాంకుకు చెందిన ఖాతాదారులంతా పరిమితికి మించి నగదును విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేదని చెబుతూ కస్టమర్లకూ ఝలక్ ఇచ్చింది. ఇంతకీ ఆర్బీఐ ఆ బ్యాంక్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించడానికి కారణం ఏంటో తెలుసు కోవాలనుందా…? అయితే ఈ వార్త పూర్తిగా చదవండి.రిజర్వు బ్యాంక్ నగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌కు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పి ఒక్కసారిగా షాకిచ్చింది.ఆ బ్యాంక్ కు చెందిన కస్టమర్లంతా రోజుకు రూ.10 వేలకు మించి డబ్బులు విత్ డ్రా చేసుకోవడం కుదరదని బాంబు పేల్చింది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంక్ యొక్క ఆర్థిక పరిస్థితులు క్షీణించడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకొచ్చింది. ఈ ఆంక్షలు డిసెంబర్ 6 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించిన ఆర్బీఐ… వచ్చే ఆరు నెలల వరకు అమలులోనే ఉంటాయని స్పష్టం చేసింది. గడువు ముగిసిన అనంతరం… సమీక్ష చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తమ అనుమతి లేనిదే బ్యాంక్ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆర్‌బీఐ హెచ్చరించింది. రుణాలు అందించడం కూడా కుదరదని చెప్పింది. మరోవైపు డిపాజిట్లు కూడా స్వీకరించ వద్దని తెలిపింది.
Rbi-imposes strict sanctions on nagar co operative bank
ప్రాపర్టీ లేదా అసెట్స్‌ను అమ్మకూడదని స్పష్టం చేసింది. ఈ విషయాల్లో బ్యాంక్ కు ఏదైనా సందేహం ఉంటే… తప్పక తమ అనుమతి తీసుకోవాలని ఆర్బీఐ ప్రకటించింది ఆర్‌బీఐ తాజా నిర్ణయాలతో నగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులంతా విస్తుపోయారు. వారి వారి బ్యాంక్ ఖాతాల్లో ఎంత నగదు ఉన్నప్పటికీ… రూ.10 వేలకు మించి తీసుకోవడం కుదరదని తెగేసి చెప్పడంతో షాక్ కు గురయ్యారు.
Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్గా…
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…
Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…
Pushpa-3 : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఒక్కటే పుష్ప–3 (Pushpa-3)ఉంటుందా? లేక ఇది…
YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్‌తో…
This website uses cookies.