RBI : ఆర్బిఐ షాకింగ్ న్యూస్… 2000 నోట్ల ప్రింటింగ్ నిలిపివేత ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RBI : ఆర్బిఐ షాకింగ్ న్యూస్… 2000 నోట్ల ప్రింటింగ్ నిలిపివేత !

 Authored By prabhas | The Telugu News | Updated on :10 November 2022,9:00 pm

RBI : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరేళ్ల క్రితం నవంబర్ 8న రాత్రి 8 గంటల సమయంలో దేశంలో 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఆరోజు అర్ధరాత్రి నుంచి అప్పటి వరకు చాలామణిలో ఉన్న 84.5% కరెన్సీ రద్దయింది. ఈ నిర్ణయం వల్ల దేశంలో మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల నల్లధనం మాయమైపోతుందని మోడీ ప్రభుత్వం అనుకుంది. అయినా ఉద్దేశం ఎంత మంచిదే అప్పటికి ఎటువంటి చర్చలు లేకుండా చేపట్టే చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయా ఇవ్వమని నోట్ల రద్దు వ్యవహారంతో తెలిసిపోయింది. దీంతో నల్లధనం ఏమాత్రం తొలగిపోలేదు. అంతేకాకుండా దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. సామాన్య ప్రజలు నోట్ల మార్పిడి కోసం ఎన్నో కష్టాలు పడ్డారు.

అయితే కేంద్ర ప్రభుత్వం 500, 1000 రద్దు అయ్యాక 2000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదే 2000 నోటుకు సంబంధించి తాజాగా ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్ 8న ఆర్బిఐ 2000 నోటును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ నోటు చలామణి తగ్గిపోయింది. ఇప్పుడు ఏటీఎంలో దగ్గర కూడా ఇవి ఎక్కువగా కనిపించడం లేదు. దీనికి గల కారణం గత మూడు సంవత్సరాలలో అంటే 2019-20, 2020-21, 2021-2022 లో 2000 కొత్త నోట్లను ఆర్బిఐ ముద్రించలేదు. తాజాగా ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంతో ఈ విషయం బయటికి వచ్చింది.

RBI not print the ₹2000 notes

RBI not print the ₹2000 notes

ఆర్టిఐ దరఖాస్తుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ నుండి వచ్చిన వివరాల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ ముద్రన్ లిమిటెడ్ 2016-17 సంవత్సరంలో 3,5429.91 కోట్ల 2000 రూపాయల నోట్లను, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1115.07 కోట్ల విలువైన 2000 నోట్లను ముద్రించినట్లు తెలిపింది. 2018 -19 సంవత్సరంలో ఆ సంఖ్యను తగ్గించామని 4066.90 కోట్ల నోట్ల మాత్రమే ముద్రించామని తెలిపింది. అయితే 2019 – 20, 2020 – 21, 2021- 22 ఆర్థిక సంవత్సరాలలో మాత్రం 2000 నోట్లను అసలు ముద్రించలేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్టిఐ కి సమాధానం ఇచ్చింది. అంటే ఈ మూడు సంవత్సరాలలో ఆర్బిఐ 2000 నోట్లను అస్సలు ముద్రించలేదు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది