RCB : ఇప్పటి వరకు ఆర్సీబీ 16 సీజన్స్ ఆడింది. ప్రతి సారి జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తుంటుంది. కాని చివరికి వచ్చే సరికి మాత్రం కప్ గెలవకుండా పోతుంది. ఈ సారైన కూడా గెలుస్తుందేమో అని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న డూఆర్ డై మ్యాచ్ ఆడిన ఆర్సీబీ వరుస పరాజయాల తర్వాత గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51), రజత్ పటీదార్(20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. కామెరూన్ గ్రీన్(20 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్)మెరుపులు మెరిపించాడు. దీంతో ఆర్సీబీ మంచి స్కోరే చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/30) మూడు వికెట్లు తీయగా.. టీ నటరాజన్(2/39)రెండు వికెట్లు, ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండేకు తలో వికెట్ దక్కించుకున్నారు.
ఇక 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీని స్వప్నిల్ దెబ్బ కొట్టాడు. అభిషేక్ శర్మ(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), ప్యాట్ కమిన్స్(15 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 31), షెహ్‌బాజ్ అహ్మద్(37 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 40 నాటౌట్) ఓ మాస్తరుగా రాణించారు. హెడ్ తొందరగానే ఔట్ కాగా, క్లాసెన్ కూడా మెరుపులు మెరిపించలేదు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిని చవి చూసింది. అయితే ఆర్‌సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, యశ్ దయాల్ తలో వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా స్వప్నిల్ సరైన సమయంలో వికెట్స్ తీసి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. చాలా మ్యాచ్ ల తర్వాత ఆర్సబీకి విజయం దక్కడంతో కోహ్లీ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.
ఆర్సీబీ యువ స్పిన్నర్ స్వప్పిల్ సింగ్ వేసిన ఐదో ఓవర్‌లో రెండో బంతిని స్వప్నిల్ ఫుల్‌టాస్‌గా వేయగా.. మార్క్‌రమ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. బంతి వేగాన్ని అంచనా వేయలేకపోయిన అతను ఎల్బీగా ఔటయి పెవీలియన్ బాట పట్టాడు. అంపైర్ నిర్ణయంపై రివ్యూకి వెళ్లిన మార్క్‌రమ్‌కి నిరాశే ఎదురైంది. భారీ షాట్ ఆడాల్సిన ఫుల్ టాస్‌కు ఎల్బీగా మార్కరమ్ వెనుదిరగడంతో విరాట్ కోహ్లీ నవ్వు ఆపుకోలేకపోయాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
This website uses cookies.