Realme GT 2 Pro : సరికొత్త ఫీచర్స్ తో రియల్ మీ జీటీ 2 ప్రో.. ఫ్లాగ్‌షిప్ స్మార్ట ఫోన్ లాంచ్
Realme GT 2 Pro : ఇండియాలో రియల్ మీ నుంచి మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. రీసెంట్ గా చైనాలో, యూరప్ మార్కెట్లో రిలీజ్ అయిన రియల్‌మీ జీటీ2 ప్రో మోడల్‌ను భారత్ లో లాంచ్ చేసింది. రియల్ మీ జీటీ సిరీస్‌లో నాలుగో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జన్ 1 చిప్‌సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ఉంది. అలాగే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ల సూపర్ డార్ట్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ప్రపంచంలోనే మొదటి 2కే LTPO 2.0 ఫ్లాట్ డిస్‌ప్లే, ప్రపంచంలోనే మొదటి 150డిగ్రీల అల్‌ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లాంటి మరిన్ని ప్రత్యేకతలు ఉన్నట్టు కంపెనీ చెబుతోంది.
రియల్‌మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 2కే LTPO అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.రియల్ మీ జీటీ 2ప్రో వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న 50 మెగాపిక్సెల్ Sony IMX766 ప్రధాన కెమెరా, 150 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉండే 50 మెగాపిక్సెల్ అల్టా వైడ్ యాంగిల్ షూటర్, 3 మెగాపిక్సెల్ మైక్రోస్కోప్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను రియల్‌మీ పొందుపరిచింది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ v5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కుడా ఉంది.

Realme GT 2 Pro latest features launch the flagship smartphone
రియల్ మీ జీటీ 2 ప్రో పర్యావరణహిత మెటీరియల్స్‌తో తయారైన ప్రపంచంలో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. బయో పాలిమర్ మెటీరియల్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానెల్‌ను రియల్‌మీ రూపొందించింది. ముఖ్యంగా పాలిమర్ పేపర్ టెక్ మాస్టర్ డిజైన్‌తో చాలా ప్రత్యేకంగా ఉంది. రియల్‌మీ జీటీ 2 ప్రో స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.57,999. పేపర్ వైట్, పేపర్ గ్రీన్, స్టీల్ బ్లాక్ కలర్స్‌లో మార్కెట్లో రెడీగా ఉన్నాయి.
Realme GT 2 Pro : జీటీ2 ప్రో ఆఫర్ మరిన్ని..
రియల్‌మీ జీటీ2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొంటే రూ.5,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో రియల్‌మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.44,999 ధరకు, 12 జీబీ+256 జీబీ వేరియంట్‌ను రూ.52,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఏప్రిల్ 14 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. తొలి సేల్‌లోనే ఈ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి రూ.4,999 విలువైన రియల్ మీ వాచ్ ఎస్ ఉచితంగా పొందవచ్చు.