Brahmins : బ్రాహ్మ‌ణులు ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తిన‌రో తెలుసా..? వాస‌న‌తో దొంగ‌ను ప‌ట్టేసిన దంప‌తులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brahmins : బ్రాహ్మ‌ణులు ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తిన‌రో తెలుసా..? వాస‌న‌తో దొంగ‌ను ప‌ట్టేసిన దంప‌తులు

 Authored By mallesh | The Telugu News | Updated on :16 June 2022,6:00 am

Brahmins : సాధార‌ణంగా ప్ర‌తి వంట‌కంలో ఉల్లి, వెల్లుల్లి త‌ప్ప‌నిస‌రిగా వాడుతుంటారు. వీటితో వంట‌కాల‌కు మంచి రుచి వ‌స్తుంది కూడా. వెల్లుల్లి వంట‌కానికి రుచితో పాటు మంచి సువాస‌న కూడా ఇస్తుంది. అలాగే ఉల్లి కూడా ప్ర‌తి వంట‌కంలో వాడుతుంటారు. ఈ రెండు కూడా హెల్త్ ప‌రంగా అద్బుత ఔష‌దంలా ప‌నిచేస్తాయి. ఆరోగ్య నిపుణులు కూడా వీటిని ఎక్కువ‌గా తీసుకొమ్మ‌ని సూచింస్తుంటారు. ఉల్లిపాయ చ‌లువ చేస్తుంద‌ని, వెల్లుల్లి క్యాన్స‌ర్ కార‌కాల‌ను నిరోధిస్తుంద‌ని చెబుతున్నారు. అయితే ఇలాంటి ఉల్లి, వెల్లుల్లిని బ్ర‌హ్మ‌ణులు ఏ వంట‌కాల్లో కూడా వాడ‌రు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్ర‌హ్మ‌ణులు ఆహారం విష‌యంలో చాలా ప‌ద్ద‌తులు పాటిస్తారు. చాలా వ‌రకు కొన్ని ర‌కాల వంట‌కాల‌ను పూర్తిగా నిషేదించి క‌ఠ‌న‌మైన ఆహార నియ‌మాలు పాటిస్తారు. ఎప్ప‌టిక‌ప్పుడు వండుకుని తింటుంటారు. తాజా కూర‌గాయ‌ల‌ను మాత్ర‌మే తీసుకుంటారు. ముఖ్యంగా మాంసాహారానికి ఆమ‌డ దూరంలో ఉంటారు. అలాగే ఉల్లి, వెల్లుల్లిని కూడా బ్ర‌హ్మ‌ణులు ఆహారంలో కానీ.. విడిగా కానీ తీసుకోరు. ఇవి రెండు కూడా మంచి ఆరోగ్యాకాలు అయిన‌ప్ప‌టికీ వాస‌న వ‌స్తున్న కార‌ణంగా తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఉల్లిపాయ, వెల్లుల్లి లో సల్ఫర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే వీటినుంచి ఎక్కువ వాసన వస్తుంటుంది.

Reason Behind Brahmins Not Eating Garlic

Reason Behind Brahmins Not Eating Garlic

Brahmins : క‌ఠిన ఆహార నియ‌మాలు..

వీటిని తీసుకోవడం వల్ల‌ నాలుకపై వాసన ఎక్కువ సేపు ఉంటుంది. తద్వారా మాట్లాడుతున్నప్పుడు కూడా నోటి నుంచి వాటి వాస‌న వ‌స్తుంటుంది. సాధార‌ణంగా బ్ర‌హ్న‌ణులు పురోహిత్యం చేస్తుంటారు. వేడుక‌ల్లో, ఆల‌యాల్లో మంత్రాలు ఉచ్చ‌రిస్తుంటారు. వీటికి స్ప‌ష్ట‌మైన ఉచ్చ‌ర‌ణ అవ‌స‌రం. అయితే ఉల్లి, వెల్లుల్లి తిన‌డం వ‌ల్ల వాటి వాస‌న వ‌చ్చి ఇబ్బంది క‌రంగా ఉంటుంది. అయితే గ‌తంలో పూదీనా కూడా తీసుకునేవారు కాద‌ట‌.. మారుతున్న కాలానిక‌నుగుణంగా మార్పులు చేసుకున్నార‌ని బ్ర‌హ్న‌ణ పండితులు చెబుతున్నారు. గ‌తంలో ఓ బ్ర‌హ్న‌ణ ఇంట్లో దొంగ‌లు ప‌డ‌గా కేవ‌లం ఉల్లిపాయ వాస‌న‌తో దొంగ‌ల‌ని ప‌ట్టేసుకున్న‌ట్లు చెబుతారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది