Categories: ExclusiveNewsTrending

Redmi Smart TV 4K : అదిరిపోయే ఫీచర్లతో రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ.. త్వరపడండి!

Redmi Smart TV 4K : ప్రముఖ సంస్థ షియోమీ నుంచి మరో స్మార్ట్ టీవీని తీసుకువస్తోంది. రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 పేరిట భారత్‌లో లాంచ్ కానుంది. 4కే రెజల్యూషన్, డాల్బీ విజన్ డాల్బీ అట్మోస్ సహా ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో ఈ టీవీ రానుంది. ఫిబ్రవరి 9న రెడ్‌మీ నోట్ 11ఎస్‌తో పాటు మన దేశంలో రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ ఎక్స్- 43ని కూడా షియోమీ లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఎక్స్-50, ఎక్స్-55, ఎక్స్-65 మోడల్స్ ఉండగా.. వీటి కంటే కాస్త తక్కువ డిస్‌ప్లే సైజ్‌తో కొత్త టీవీ వస్తోంది.43 ఇంచుల 4కే రెజల్యూషన్ డిస్‌ప్లేతో ఈ స్మార్ట్ టీవీ వస్తోంది. అలాగే 4కే హెచ్‌డీఆర్, డాల్బీ విజన్‌కు ఈ డిస్‌ప్లే సపోర్టు చేస్తుంది.

పర్ఫార్మెన్స్ కూడా ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో ఉంటుందని షియోమీ పేర్కొంది. మాలీ జీ53 జీపీయూతో కూడిన మీడియాటెక్ ప్రాసెసర్‌ ఈ టీవీలో ఉంది. అలాగే 30 వాట్ల స్పీకర్ ఔట్ పుట్, డాల్బీ అట్మోస్ సపోర్టుతో ఈ టీవీ వస్తోంది. రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ ఎక్స్43 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ (Android OS)తో నడుస్తుంది. షియోమీ లేటెస్ట్ పాచ్‌వాల్ సాఫ్ట్‌వేర్ ఇందులో ఉంటుంది. విభిన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్, యాప్స్‌ను పాచ్‌వాల్ అందిస్తుంది. అలాగే ఈ పాచ్‌వాల్ ద్వారా స్మార్ట్‌లైట్లు లాంటి స్మార్ట్ హోమ్ డివైజెస్‌ను కూడా కంట్రోల్ చేసే ఫీచర్ ఉంటుంది.

redmi smart tv with creepy features

Redmi Smart TV 4K : రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్-43 ఫీచర్లు

రెడ్ మీ టీవీ విడుదల తేదీని వెల్లడించిన షియోమీ ఇంకా ధర ప్రకటించలేదు. ఫిబ్రవరి 9న విడుదలయ్యే ఈ టీవీ, ఎప్పుడు అమ్మకానికి వస్తుందన్న వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్-50 ధర రూ.37,999గా ఉండగా.. కొత్తగా వస్తున్న ఈ టీవీ డిస్‌ప్లే తక్కువ కావడంతో ధర కూడా తక్కువే ఉండే అవకాశముంది. రూ.30 వేలలోపు రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్- 43 వస్తే మాత్రం ఆ రేంజ్‌లో మంచి ఆప్షన్‌గా నిలవనుంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago