
reliance jio 5g speed test leaked
Reliance Jio 5G: భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికే పలు సంచలనాలు సృష్టించిన జియో ఇప్పుడు మరో ముందడగు వేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1000కిపైగా నగరాల్లో 5జీ సేవలను అందించేందుకు జియో సిద్దమైంది. కాగా తాజాగా నిర్వహించిన 5జీ టెస్టింగ్‌లో రిలయన్స్ జియో రికార్డు వేగాన్ని సాధించింది. ఇప్పటికే 5జీ ట్రయల్స్‌ను విస్తృతంగా నిర్వహిస్తోంది. 5జీ కోసం అన్ని చర్యలు వేగంగా తీసుకుంటోంది. ఈ తరుణంలో రిలయన్స్ జియో 5జీ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.
రిలయన్స్ జియో 5G నెట్‌వర్క్ , 4G నెట్‌వర్క్‌తో పోల్చితే ఎనిమిది రెట్లు వేగంగా డౌన్‌లోడ్ స్పీడ్, 15 రెట్లు వేగవంతమైన అప్‌లోడ్ స్పీడ్‌ను అందిస్తుంది. జియో 5జీ నెట్‌వర్క్ 420Mbps డౌన్‌లోడ్ స్పీడ్, 412 Mbps అప్‌లోడ్ స్పీడ్ సాధించినట్లు 91మొబైల్స్ వెల్లడించింది. ఈ స్పీడ్‌తో రెండు గంటల నిడివి గల సినిమాను ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో డౌన్‌లోడ్ చేయవచ్చును. దేశవ్యాప్తంగా 13 నగరాల్లో మొదట 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా 1,000 టాప్ సిటీలకు 5G కవరేజ్‌ను రిలయన్స్ జియో ప్లానింగ్ చేస్తోంది.
reliance jio 5g speed test leaked
5జీ టెక్నాలజీతో హెల్త్ కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో అధునాతన సదుపాయాలను ఉపయోగించి జియో ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. త్రీడీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీ ద్వారా 5జీ సేవల సామర్థ్యాన్ని పరీక్షించనుంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఈ 5జీ నెట్‌వర్క్ టెస్టు జరిగింది. జియో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ 47ఎంబీపీఎస్, అప్‌లోడ్ స్పీడ్ 26ఎంబీపీఎస్‌గా ఉండగా.. దానితో పోలిస్తే 5జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ 8రెట్లు, అప్‌లోడ్ 15 రెట్లు వేగంగా ఉంది. అయితే ఇది ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాలు. ప్రజలకు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన సమయంలో వేగంలో మార్పులు ఉండొచ్చు. గతంలో 4జీ విషయంలోనూ ఇదే జరిగింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.