Reliance Jio 5G : మ‌రింత వేగంగా జియో స్పీడ్.. .రెండు గంటల సినిమా ఒక నిమిషంలోనే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Reliance Jio 5G : మ‌రింత వేగంగా జియో స్పీడ్.. .రెండు గంటల సినిమా ఒక నిమిషంలోనే…!

 Authored By sandeep | The Telugu News | Updated on :28 January 2022,1:00 pm

Reliance Jio 5G: భార‌త టెలికాం రంగంలో రిల‌య‌న్స్ జియో సృష్టిస్తున్న సంచ‌ల‌నాలు అన్నీ ఇన్ని కావు. ఇప్ప‌టికే ప‌లు సంచ‌ల‌నాలు సృష్టించిన జియో ఇప్పుడు మ‌రో ముంద‌డ‌గు వేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1000కిపైగా నగరాల్లో 5జీ సేవలను అందించేందుకు జియో సిద్దమైంది. కాగా తాజాగా నిర్వహించిన 5జీ టెస్టింగ్‌లో రిలయన్స్‌ జియో రికార్డు వేగాన్ని సాధించింది. ఇప్పటికే 5జీ ట్రయల్స్‌ను విస్తృతంగా నిర్వహిస్తోంది. 5జీ కోసం అన్ని చర్యలు వేగంగా తీసుకుంటోంది. ఈ తరుణంలో రిలయన్స్ జియో 5జీ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.

రిలయన్స్ జియో 5G నెట్‌వర్క్ , 4G నెట్‌వర్క్‌తో పోల్చితే ఎనిమిది రెట్లు వేగంగా డౌన్‌లోడ్ స్పీడ్, 15 రెట్లు వేగవంతమైన అప్‌లోడ్ స్పీడ్‌ను అందిస్తుంది. జియో 5జీ నెట్‌వర్క్‌ 420Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌, 412 Mbps అప్‌లోడ్ స్పీడ్‌ సాధించినట్లు 91మొబైల్స్‌ వెల్లడించింది. ఈ స్పీడ్‌తో రెండు గంటల నిడివి గల సినిమాను ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో డౌన్‌లోడ్ చేయవచ్చును. దేశవ్యాప్తంగా 13 నగరాల్లో మొదట 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా 1,000 టాప్‌ సిటీలకు 5G కవరేజ్‌ను రిలయన్స్‌ జియో ప్లానింగ్ చేస్తోంది.

Reliance Jio 5G  : జియోతో స‌రికొత్త సంచ‌ల‌నం..

reliance jio 5g speed test leaked

reliance jio 5g speed test leaked

5జీ టెక్నాలజీతో హెల్త్ కేర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో అధునాతన సదుపాయాలను ఉపయోగించి జియో ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. త్రీడీ మ్యాప్స్‌, రే ట్రేసింగ్‌ టెక్నాలజీ ద్వారా 5జీ సేవల సామర్థ్యాన్ని పరీక్షించనుంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఈ 5జీ నెట్‌వర్క్ టెస్టు జరిగింది. జియో 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ 47ఎంబీపీఎస్, అప్‌లోడ్ స్పీడ్ 26ఎంబీపీఎస్‌గా ఉండగా.. దానితో పోలిస్తే 5జీ నెట్‌వర్క్ డౌన్‌లోడ్ 8రెట్లు, అప్‌లోడ్ 15 రెట్లు వేగంగా ఉంది. అయితే ఇది ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాలు. ప్రజలకు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన సమయంలో వేగంలో మార్పులు ఉండొచ్చు. గతంలో 4జీ విషయంలోనూ ఇదే జరిగింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది