Home » Exclusive » Reliance Jio Introduces 4 New Recharge Plans
Exclusive

Jio : అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చిన జియో… డేటా తో పాటు ఓటీపీ సబ్ స్క్రిప్షన్ కూడా…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: September 18, 2022 10:54 pm
Advertisement

Jio : టెలికాం దిగ్గజం అయిన రిలయన్స్ జియో సరికొత్త ఒరవడిని సృష్టించింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తుంది రిలయన్స్ జియో. మరీ ముఖ్యంగా ఓటీపీ ప్లాట్ఫార్మ్స్ బాగా పెరిగిన తర్వాత జియో డేటా కాల్స్ తో పాటు ఓటిటి సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా కొత్తగా నాలుగు రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ల వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

1) రూ.419 ప్లాన్: ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ తో పాటు 84జీబీ డేటా అందుతుంది. రోజుకు 3జీబీ ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ పొందవచ్చు. అలాగే వీటితో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS లు అందిస్తారు. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ వర్షన్ కి మూడు నెలల పాటు సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు.

Reliance jio introduces 4 new recharge plans

Advertisement

2) రూ.601 ప్లాన్: ఈ ప్లాన్ లో వినియోగదారులకు మొత్తం 90జిబి డేటాను అందిస్తారు. 28 రోజుల వ్యాలిడిటీ రోజుకు 3జీబీ డేటా అందిస్తారు. అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS లు పొందవచ్చు. అలాగే యూజర్లకు ఒక సంవత్సరం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ను కూడా అందిస్తున్నారు.

3) రూ.1,199 : ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న వారికి రోజుకి 3జీబీ డేటా చొప్పున 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. మొత్తం 252జీబీ డేటాను పొందవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లతోపాటు మూడు నెలల వ్యాలిడిటీ తో కూడిన 149 విలువైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు.

Advertisement

4) రూ.4,199 : ఓటీటీ కోసం జియో అందిస్తున్న మరో ప్రత్యేక రీచార్జ్ ఆప్షన్ ఇది. దీని ద్వారా సంవత్సరం వ్యాలిడిటీతో రోజుకు మూడు జీబీ చొప్పున 1095జీబీ డేటాను అందిస్తారు. అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లతోపాటు ఒక సంవత్సరం డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి