Health Benefits : కీవీ పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు లేదా ఆరోగ్యం కోసం కీవీ జ్యూస్ లేదా కీవీ పండు తినాలని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా అనేక రకాల వైరల్ ఫీవర్లు, రక్త కణాల సంఖ్య పెంచడానికి కీవీ పండని తినమని చెబుతారు. కీవీలో ఉండే గుణాలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. కీవీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు వంటి అనేక లక్షణాలు ఉంటాయి. అలాగే విటమిన్ సి, విటమిన్ B6, ఫైబర్, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, రైబోఫ్లెవిన్, బీటా కెరోటిన్ వంటి విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి.
కీవీలో ఉండే గుణాలు అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. కానీ ఈ పండును ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీంతో అనేక సమస్యలకు దారితీస్తుంది. కీవీని అధిక మోతాదులో తీసుకుంటే ఎలర్జీ లాంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా దీనివల్ల చర్మంపై దద్దుర్లు, వాపులు, నోటి లోపల చికాకు, ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ రోగులు కివి పండ్లను ఎక్కువగా తినకూడదని సూచిస్తున్నారు. కీవీలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణం అవుతుంది.
అందువల్ల కీవీని ఎక్కువగా తీసుకోకూడదు. కీవీ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వలన నోటి అలర్జీ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ కారణంగా పెదవులు, నాలుక వాపు, నోటి లోపల పుండ్లు లాంటి సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కీవీ పండు లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా డయోరియా సమస్యలు రావచ్చు. అంతేకాకుండా కొంతమందికి కడుపునొప్పి, వాంతులు, వికారం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. అందుకే కీవీ పండ్లను ఎక్కువగా తీసుకోకూడదు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.