Paneer Soya Masala : రెస్టారెంట్ స్టైల్ లో పన్నీర్ సోయా మసాలా కర్రీ… ఇది అన్నిట్లోకి అదిరిపోతుంది…
Paneer Soya Masala : మనం నిత్యం చేసుకునే వెజిటేబుల్స్ కర్రీస్ బోర్ కొడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వెరైటీగా తినాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడు రెస్టారెంట్లకు వెళ్లి తింటూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో సోయా, పన్నీర్ తో కర్రీ తయారు చేసి చూద్దాం.. కావాల్సిన పదార్థాలు : పన్నీర్, సోయా లవంగాలు, జీడిపప్పులు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, గసగసాలు, అల్లం ఎల్లిపాయలు, జీలకర్ర పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటాలు, కారం, ఉప్పు, వాటర్, బటర్, ఆయిల్, కసూరి మేతి, గరం మసాలా, కొత్తిమీర మొదలైనవి.
తయారీ విధానం : ముందుగా ఒక చిన్న కప్పు సోయా ని తీసుకొని వేడి నీటిలో ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు నాననివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలని తీసుకుని ఇవి కూడా ఉప్పు నీటిలో వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత ఒక పాన్లో రెండు స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, రెండు యాలకులు, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత దానిలో నాలుగైదు జీడిపప్పు పలుకులు, ఒక స్పూన్ గసగసాలు వేసి వేయించుకొని పొడి పొడి చేసుకునే ముందు ఐదారు వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క కొన్ని నీళ్లు వేసి మెత్తని పేస్టులా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టిన సోయా ని గట్టిగా పిండి బటర్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
తరువాత స్టౌ పై ఒక బాండి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్, వేసి దానిలో ఒక స్పూన్ జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయలు, రెండు రెమ్మల కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలను ఒక నాలుగు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత దానిలోకి ముందుగా చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని దీంట్లో వేసి బాగా మగ్గనివ్వాలి ఆయిల్ బయటికి వచ్చేవరకు మగ్గనిచ్చిన తర్వాత ఒక కప్పు టమాట ముక్కలను వేయాలి. కొద్దిసేపు మూత పెట్టి అలా ఉంచిన తర్వాత దాన్లో ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ ను వేయాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత రెండు స్పూన్ల కారం, రెండు స్పూన్ల ఉప్పు, అర స్పూన్ గరం మసాలా వేసి బాగా ఉడకనివ్వాలి. తరువాత ముందుగా ఉప్పునీటిలో వేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను తీసి దీనిలో వేసి రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లోకి కసూరి మేతి కూడా కొంచెం, కొంచెం బట్టర్ వేసుకోవాలి. ఇక దింపేముందు కొత్తిమీర వేసి దింపుకోవాలి. అంతే రెస్టారెంట్ స్టైల్ లో పన్నీర్ సోయా మసాలా కర్రీ రెడీ..