బిగ్ బ్రేకింగ్ : టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కాదట.. ఎవరో తెలిస్తే మీ గుండె ఆగిపోద్ది?
తెలంగాణ ప్రస్తుతం ఏదైనా హాట్ టాపిక్ నడుస్తోందంటే అది టీపీసీసీ చీఫ్ గురించే. అవును.. ఎప్పుడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారో.. అప్పటి నుంచి టీపీసీసీ చీఫ్ గా ఎవరిని నియమిస్తారు అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఎక్కువగా రేవంత్ రెడ్డి పేరే వినిపించడంతో.. ఇక రేవంత్ రెడ్డినే టీపీసీసీ చీఫ్ గా నియమిస్తారు కావచ్చు అని అంతా అనుకున్నారు.
ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్ కూడా… తెలంగాణకు వచ్చి.. కాంగ్రెస్ సీనియర్ నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకొని సోనియా గాంధీకి సమర్పించారు. అన్ని సమీకరణలను దృష్టిలో పెట్టుకొని సోనియా, రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా అనుకున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డే టీపీసీసీ చీఫ్ అంటూ ప్రచారం సాగింది.
రేవంత్ రెడ్డి.. టీపీసీసీ చీఫ్ అనే ప్రచారం ప్రారంభం కాగానే.. కొందరు సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ కు టీపీసీసీ పీఠం ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పీఠం ఇస్తే తాము పార్టీ నుంచి వెళ్లిపోతామంటూ వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి కాకుండా.. రేసులోకి వచ్చిన జీవన్ రెడ్డి
అయితే సడెన్ గా మంగళవారం ఉదయం నుంచి రేవంత్ రెడ్డి పేరు కాకుండా.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. జీవన్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. సోనియా గాంధీ టీపీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డిని నియమించినట్టు తాజాగా ప్రచారం సాగుతోంది.
అయితే.. రేవంత్ రెడ్డి సేవలు కూడా పార్టీకి అవసరం కాబట్టి.. రేవంత్ రెడ్డిని ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నియమించాలని హైకమాండ్ భావిస్తోందట. రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తికి లోనవకుండా ఉండేందుకు ఆయనకు ప్రచారకమిటీని అప్పగించనున్నట్టు తెలుస్తోంది.