Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్లాన్ చేంజ్.. కేటీఆర్ సీఎం అని తెలియగానే.. ఏం చేశారంటే?
Revanth Reddy – రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం కాంగ్రెస్ కు ఉన్న దిక్కు ఆయనొక్కరే. ఆయన కూడా లేకపోతే పార్టీ పరువు గంగలో కలవాల్సిందే. అందుకే.. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి మీదనే ఆశలు పెట్టుకుంది. రేపు పొద్దున పార్టీని బలపరచాలన్నా.. గెలిపించాలన్నా.. అది రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది. తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. అధికార టీఆర్ఎస్ పార్టీని విమర్శించాలంటే రేవంత్ రెడ్డి తర్వాతనే ఎవ్వరైనా. అందుకే రేవంత్ రెడ్డికి తెలంగాణలో అంత పాపులారిటీ.
revanth reddy plan change to target trs party
టీపీసీసీ చీఫ్ పదవిని కూడా రేవంత్ కే ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ రెడీ అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను డైరెక్ట్ గా విమర్శించే సత్తా ఉన్న నాయకుడు కాబట్టే.. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ లో భవితవ్వం కనబడింది. ఎప్పుడూ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శించే రేవంత్ రెడ్డి.. తాజాగా తన వ్యూహాన్న చేంజ్ చేసుకున్నారట. చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇన్ని రోజులు కేసీఆర్ ను విమర్శించారు. కానీ.. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ హవా తగ్గిపోయింది. ప్రస్తుతం కేసీఆర్ కూడా నెమ్మదించారు. ఈనేపథ్యంలో కేసీఆర్ ను విమర్శిస్తూ కూర్చోవడం వల్ల వచ్చే ఫైదా ఏం ఉండదు.. అని రేవంత్ రెడ్డికి అర్థం అయినట్టుంది. అందుకే తన గేర్ మార్చినట్టుగా పొలిటికల్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
కేటీఆర్ మీద ఫోకస్ ఫిక్స్
త్వరలోనే కేసీఆర్.. తన కొడుకు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి.. తను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. జాతీయ రాజకీయాలకు వెళ్తారు.. అంటూ వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజమెంత.. అబద్ధమెంత అనే విషయం పక్కన పెడితే.. ఎలాగూ భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించేది కేటీఆర్ కాబట్టి.. రేవంత్ రెడ్డి తన ఫోకస్ ను కేటీఆర్ మీదికి షిఫ్ట్ చేశారట.
కేటీఆర్ ను ఎలాగైనా ఇరికించాలని తెగ ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే కేటీఆర్ ఫామ్ హౌస్ మీద రేవంత్ రెడ్డి రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దానిపై కేటీఆర్ వివరణ ఇవ్వడంతో ఆ విషయం అక్కడితో సద్దుమణిగిపోయింది. కానీ.. ఈ సారి ఏదైనా బలమైన దాన్ని పట్టుకొని కేటీఆర్ ను ఇరుకున పెట్టడమే ప్లాన్ గా రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి భవిష్యత్తులో ఏమౌతుందో?