Revanth Reddy : ఆగ్రహంతో కేసీఆర్ పై ఊగిపోయిన రేవంత్ రెడ్డి.. ఇంకా ఎంతమందిని ఇలా బలి తీసుకుంటారు?
Revanth Reddy : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన చేయడం లేదని.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇక రావని… తెలంగాణ వచ్చాక కూడా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగక… నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారని… ఇక తనకు కూడా ఉద్యోగం రాదనే భయంతో కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఓ నిరుద్యోగి సునీల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
సునీల్ ఆత్మహత్యపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు అయితే తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న సునీల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడి…. సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈసందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… సునీల్ నాయక్ ది ఆత్మహత్య కాదు…. ప్రభుత్వ హత్య అంటూ మండిపడ్డారు. కేసీఆర్ పై ఆగ్రహంతో ఊగిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాగే విద్యార్థులను రెచ్చగొట్టి కేసీఆర్ అండ్ కో విద్యార్థుల చావులకు కారణమయ్యారని దుయ్యబట్టారు.
Revanth Reddy : అప్పుడు ఉద్యమం కోసం… ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వక
అప్పుడేమో ఉద్యమం కోసం విద్యార్థులను చంపిన కేసీఆర్ అండ్ కే… ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ల చావులకు కారణం అవుతున్నారు. ఇంకా ఎంతమంది విద్యార్థులు ఇలా తమ ప్రాణాలను త్యాగం చేయాలి. ఓవైపు విద్యార్థులు తమ ప్రాణాలను బలి ఇస్తుంటే… కేసీఆర్ కుటుంబం హాయిగా బతుకుతోంది. అసలు టీఎస్పీఎస్సీ కమిటీ ఉందా? అది ఎక్కడడ ఉంది. వెంటనే ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి. వెంటనే ఏప్రిల్ నెల నుంచి ప్రతి నిరుద్యోగికి భృతి ఇవ్వాలి.. అని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.